Political News

టార్గెట్ కేసీఆర్ కాదు.. ఆయ‌న ఇమేజే!

స‌రిగ్గా పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు ముందు.. తెలంగాణ అసెంబ్లీలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు.. బీఆర్ ఎస్ పార్టీకి, ముఖ్యంగా కేసీఆర్ ఇమేజ్‌కు కూడా తీవ్ర ఇబ్బందిగా మారాయ‌నే వాద‌న వినిపిస్తోంది. వాస్త‌వానికి బీఆర్ ఎస్‌ను ఓడించి అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీకి.. సంపూర్ణంగా నిద్ర‌ప‌ట్టే అవ‌కాశం లేదు. ప‌క్క‌లో బ‌ల్లెంలా బీఆర్ ఎస్ వ్య‌వ‌హార శైలి ఉంది. ఎందుకంటే.. ప్ర‌స్తుతం కాంగ్రెస్ మ‌ద్ద‌తు.. 64 మాత్ర‌మే. వీరిలో ఓ ప‌ది మందిని త‌మ‌వైపు తిప్పేసుకుంటే.. కొత్త‌గా ప్ర‌భుత్వం తాము ఏర్పాటు చేసినా చేయ‌క‌పోయినా.. కాంగ్రెస్‌ను గ‌ద్దె దింపేశామ‌న్న సంతృప్తి బీఆర్ ఎస్‌కు ఉంటుంది.

ఈ వ్యూహం మ‌న‌సులో ఉందో ఏమో.. కాంగ్రెస్ ప్ర‌భుత్వం మూణ్నాళ్ల ముచ్చ‌టేన‌ని కేసీఆర్ నుంచి కింది స్తాయి నాయ‌కుల వ‌ర‌కు కూడా చాలా మంది చెబుతున్నారు. దీనికి ప్ర‌ధాని కార‌ణం.. కేసీఆర్ పార్టీ ప‌రంగా ఓడిపోయినా.. ఆయ‌న ఇమేజ్‌కు వ‌చ్చిన ఢోకాలేదు. ఇప్ప‌టికీ.. గ్రామీణ ఓటు బ్యాంకులో కేసీఆర్ అంటే.. ‘సార్ లెక్కే’ చూస్తున్నారు. ఈ ఇమేజ్ ఉన్నంత కాలం.. కాంగ్రెస్‌కు సంక‌ట‌మే. ఎప్పుడు ఏ క్ష‌ణంలో ఎలాంటి ప‌రిణామాలు ఎదురైనా.. త‌ట్టుకునే ప‌రిస్థితి కాంగ్రెస్‌కు అవ‌స‌రం.

కానీ, ఈ ప‌రిస్థితి రావాలంటే.. ప‌దిలంగా ఐదేళ్లు ఉండాలంటే.. కాంగ్రెస్ కు బ‌ల‌మైన పునాదులు ప‌డాల్సిన అవ‌స‌రం క‌న్నా.. బీఆర్ ఎస్ కు బ‌ల‌మైన నాయ‌కుడిగా ఉన్న కేసీఆర్‌ను బ‌ల‌హీన ప‌ర‌చాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలోనే స‌భ‌లో వ‌రుస పెట్టి.. ప్రాజెక్టుల విష‌యాన్ని.. ఇత‌ర సంక్షేమ ప‌థ‌కాలు, విద్యుత్‌, రైతుల స‌మ‌స్య‌ల‌ను కాంగ్రెస్ ఏక‌రువు పెడుతోంది. త‌ద్వారా.. కేసీఆర్ ఇమేజ్ పై ఆధార‌ప‌డిన బీఆర్ ఎస్‌ను వీక్ చేసి.. ప్ర‌జ‌ల్లో మ‌రింత‌గా బీఆర్ ఎస్ సానుకూల ప‌వ‌నాలు త‌గ్గించే ప్ర‌య‌త్నం చేస్తోంది.

ఇప్ప‌టి వ‌రకు ఉన్న అంచ‌నాల ప్ర‌కారం.. బీఆర్ ఎస్ ఓడింది కానీ.. కేసీఆర్ మాత్రం కాద‌నే వాద‌న ఉంది. అంటే.. కేసీఆర్ ఇమేజ్‌కు వ‌చ్చిన ఢోకాలేద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇప్పుడు సీఎం రేవంత్ అయినా.. కాంగ్రెస్ నాయ‌కులు అయినా.. బీఆర్ ఎస్ పార్టీని టార్గెట్ చేయ‌డం కంటే కూడా.. తెలంగాణ తెచ్చామ‌ని.. బంగారు పాల‌న చేశామ‌ని ప్ర‌చారం చేసుకుంటున్న‌ కేసీఆర్ ఇమేజ్‌ను టార్గెట్ చేయ‌డ‌మే ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది. ఇది స‌క్సెస్ అయితే.. బీఆర్ ఎస్ ఎంత బ‌లంగా ఉన్నా.. ఎంత బ‌ల‌హీనంగా ఉన్నా త‌మ‌కు ఇబ్బంది లేద‌నే వాద‌న వినిపిస్తోంది.

This post was last modified on February 15, 2024 8:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తేజ సజ్జ మెచ్యూరిటీని మెచ్చుకోవచ్చు

అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…

57 mins ago

జనసేన, శివసేనల లక్ష్యం అదే: పవన్

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…

59 mins ago

ఆరెంజ్ హీరోయిన్ పెళ్లి కుదిరింది

అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…

2 hours ago

పుష్ప 2 హంగామా వేరే లెవెల్

టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…

2 hours ago

కాంట్రాక్లర్ల జీవితాలు జగన్ నాశనం చేశాడు

విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…

2 hours ago

ఓట్ల కోసం రాలేదు.. మరాఠా గడ్డపై పవన్

మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…

2 hours ago