చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకున్నట్టుగా.. కొన్ని కొన్ని విషయాల్లో కోర్టులు తీర్పులు ఇస్తున్నాయనే వాదన న్యాయ వర్గాల నుంచే వినిపిస్తోంది. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును చూస్తే.. కీలక మైన బీజేపీ ఎన్నికలకు ముందు.. సర్వం సహా.. జాగ్రత్తపడి ఖజానా నింపుకున్న తర్వాత.. కోర్టు కొరడా ఝళిపించిందని జాతీయ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే విషయంలో ప్రస్తుతం మూడు రకాల విధానాలు అమల్లో ఉన్నాయి.
ఒకటి రసీదు తీసుకుని ఇచ్చే విరాళాలు. ఇవి స్వల్ప మొత్తంలోనే ఉంటాయి. ఎందుకంటే.. రాత పూర్వకం గా అన్ని వివరాలు నమోదు చేస్తారు కాబట్టి. రెండోది.. ఎలాంటి రసీదుతో పనిలేకుండా.. వ్యక్తులు, సంస్థల పేరుతో ఇచ్చే విరాళాలు. వీటికి 80సీ నిబంధన కింద.. పన్ను మినహాయింపు ఉంటోంది. దీనిని కూడా.. పాటిస్తున్నారు. కానీ, ఇది కూడా తక్కువగానే ఉంది. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో జరుగుతున్న లావాదేవీలే ఎక్కువగా ఉన్నాయి. వీటిలో ఎవరు.. ఎక్కడ నుంచి పార్టీలకు విరాళాలు ఇస్తున్నారనే విషయం వెల్లడి కాదు.
దీంతో ఈ రూపంలో ఎక్కువ మొత్తంలో అంటే.. కోట్ల రూపాయల్లో నే పార్టీలకు విరాళాలు అందుతున్నాయి. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ క్రతువును కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పూర్తి చేసేసింది. ఇటీవలే అంతర్గత నిర్ణయంగా కూడా.. ఎలక్టోరల్ బాండ్లకు గేట్లు మూసేస్తున్నామని ప్రకటించడంతో మరుసటి రోజు 100 కోట్ల రూపాయలకు పైబడి నిధులు అందినట్టు జాతీయ మీడియా కొన్ని రోజుల కిందటే వెల్లడించింది.
ఇప్పుడు ఏం జరిగింది.?
‘ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్’పై సుప్రీంకోర్ట్ సంచలన తీర్పు ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ చట్టవిరుద్ధ మని తేల్చిచెప్పింది. ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని, ఈ స్కీమ్‌ని నిలిపివేయాలని సీజేఐ చంద్రచూడ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. రాజకీయ విరాళాల్లో పారదర్శకతను తీసుకొచ్చేందుకు 2018లో తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. నల్లధనాన్ని రూపుమాపడానికి ఎలక్టోరల్ బాండ్లు ఒక్కటే మార్గం కాదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అయితే.. ఇప్పటికే బీజేపీ భారీ మొత్తంలో సేకరించిన నిధుల వ్యవహారం ముగిసిన దరిమిలా.. ఈ తీర్పు రావడంతో న్యాయనిపుణులు పెదవి విరుస్తున్నారు.
This post was last modified on February 15, 2024 2:30 pm
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో అనేక రికార్డు మెగాస్టార్ చిరంజీవి పేరు మీదే ఉన్నాయి. ఒకప్పుడు ఆయన చూసిన వైభవమే వేరు.…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానానికి చెడిందా? ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు మైలేజీ పొందలేక, పదేళ్ల పాటు అధికారానికి…
సీనియర్ నటుడు నరేష్ వ్యక్తిగత జీవితం గురించి కొన్నేళ్ల ముందు ఎంత గొడవ జరిగిందో తెలిసిందే. తెలుగు సినిమాల్లో బిజీ…
గౌతమ్ మీనన్.. గత పాతికేళ్లలో సౌత్ ఇండియా నుంచి వచ్చిన గ్రేట్ డైరెక్టర్లలో ఒకడు. కాక్క కాక్క, ఏమాయ చేసావె,…
ప్రభుత్వం తరఫున పనులు పూర్తి కావాలంటే రోజులు వారాలే కాదు.. నెలలు సంవత్సరాల సమయం కూడా పడుతుంది. అనేక మంది…
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…