Political News

ఏపీపై మరో బ్యాడ్ రిమార్క్

ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఏపీలో కొద్ది రోజుల నుంచి రోజుకు దాదాపుగా పది వేల కేసులకు పైగా నమోదవడం కలవరపెడుతోంది. మరోవైపు, దేశంలో సంభవిస్తోన్న కరోనా మరణాల్లో 70 శాతం కరోనా మరణాలు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర , కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచే నమోదవుతున్నాయని కేంద్రం వెల్లడించింది.

దీంతో పాటు, దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల విషయంలోనూ ఈ ఐదు రాష్ట్రాల నుంచే 62 శాతం కేసులు వస్తున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీపై మరో బ్యాడ్ రిమార్క్ పడింది. దక్షిణాది రాష్ట్రాల్లో నిరుద్యోగ శాతం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో నిలిచింది.

ఆగస్టు నెలకుగాను దేశవ్యాప్తంగా 8.1 శాతం నిరుద్యోగం నమోదైందని సెంటర్‌ ఆఫ్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) తాజా నివేదికలో వెల్లడైంది. పట్టణాల్లో 9.5 శాతం, గ్రామాల్లో 7.4 శాతం నిరుద్యోగం నమోదైనట్టు సీఎంఐఈ వెల్లడించింది.

ఏపీలో రోజురోజుకూ నిరుద్యోగం పెరుగుతోంది. ఓ వైపు కరోనా మహమ్మారి భయం….మరో వైపు నిరుద్యోగం…వెరసి ఏపీ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. దీంతో, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా నిరుద్యోగ శాతం విస్తరిస్తోంది. కరోనా పుణ్యమా అంటూ అధిక శాతం ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు కోల్పోవడం వల్ల ఈ పరిస్థితి మరింత పెరిగినట్టు అంచనా. ఇదే పరిస్థితి కొనసాగితే భవిషత్తు మరింత ఆందోళనగా మారే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరోవైపు, దేశవ్యాప్తంగా నిరుద్యోగభూతం భయాందోళనలకు గురిచేస్తోందని సీఎఐఈ వెల్లడించింది. ఆగస్టు నెలకుగాను దేశవ్యాప్తంగా 8.1 శాతం నిరుద్యోగం నమోదైందని వెల్లడించింది. ఈ నివేదికలో దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ 7 శాతం నిరుద్యోగంతో రెండో స్థానంలో నిలిచింది.

కర్ణాటక 0.5 శాతం నిరుద్యోగంతో చివరి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా అత్యల్ప నిరుద్యోగ శాతం ఉన్న రాష్ట్రం కర్ణాటక కావడ విశేషం. ఇక, పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడుల్లో 5.8 శాతం నిరుద్యోగం నమోదైంది. దేశవ్యాప్తంగా హరియాణా 33.5 శాతం నిరుద్యోగంతో అగ్రస్థానంలో ఉంది. దక్షిణాదిలో కేరళ 11 శాతం నిరుద్యోగంతో మొదటి స్థానంలో నిలిచింది.

This post was last modified on September 9, 2020 10:33 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

2 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

2 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

2 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

2 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

4 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

4 hours ago