తెలుగు నుంచి బాలీవుడ్ వరకు.. అనేక సినిమాలు చేసిన నటి, రాజకీయంగా కూడా.. తనదైన గుర్తింపు తెచ్చుకున్న నాయకురాలు.. జయప్రద. అయితే.. ఇప్పుడు ఆమె తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఆమెను తక్షణం.. ఎక్కడున్నా అరెస్టు చేయండి! అని కోర్టు ఆదేశాలు ఇచ్చే పరిస్థితిని తెచ్చుకున్నారు. మరి ఇంతకీ ఏంజరిగింది? ఎందుకు కోర్టు ఇంతగా రియాక్ట్ అయింది? అనేది ఆసక్తిగా మారింది.
టీడీపీలో ప్రారంభించిన జయప్రద రాజకీయం.. యూపీకి చేరింది. టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపికైన జయప్రద.. తర్వాత అక్కడ ఏర్పడిన ఉత్తరాది పరిచయాలతో యూపీలోని సమాజ్ వాదీ పార్టీలో చేరారు. అక్కడే రాంపూర్ నుంచి పోటీ చేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత.. బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆమె రాజకీయంగా దూరంగా ఉన్నారు. అయితే.. ఆమె ఎంపీగా ఉన్న సమయంలో ఈఎస్ ఐ కి సంబంధించిన కుంభకోణంలో కేసు నమోదైంది.
దీని నుంచి ఇంకా బయటకు రాకముందే.. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించిన నేరంపై ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులోనే తాజాగా ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచాలంటూ రాంపుర్ ఎస్పీని ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశించింది. కౌమరి, స్వార్ పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్నాయి. అయితే, విచారణలో భాగంగా అనేక సార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు. దీంతో ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.
This post was last modified on February 13, 2024 4:39 pm
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…