ఏపీలో రహదారులు బాగోలేదని.. ఎక్కడికక్కడ గుంతలు.. అతుకులే కనిపిస్తున్నాయని.. కొన్నాళ్లుగా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తన్న విషయం తెలిసిందే. ఒకానొక దశలో పెద్ద ఎత్తున రాజకీయ ఉద్యమాలు కూడా జరిగాయి. అయినప్పటికీ.. ప్రభుత్వం మాత్రం ఒక్కరోడ్డు కూడా నిర్మించలేదు. అంతేకాదు.. అసలు ఎవరు ఎన్ని మాటలు అన్నా.. పట్టించుకున్న దాఖలా కూడా లేదు. పోనీ.. ఎన్నికలకు ముందైనా.. రహదారులను పట్టించుకుంటారని.. రోడ్లు వేస్తారని అనుకుందామన్నా.. అసలు ఆ ఊసే లేకుండా పోయింది.
పోనీలే.. సంక్షేమ పథకాలకు నిధులు చాలక.. రోడ్లు వేయడం లేదేమో.. అని సరిపెట్టుకుందామా? అంటే.. అయిన వారి ఇళ్లకు.. కావాల్సిన వారి ఫాం హౌస్‌లకు ప్రభుత్వం తన సొంత నిధులతో రహదారు లను అద్దంలా నిర్మిస్తోంది. కొన్నాళ్ల కిందట మంత్రి బొత్స ఇంటి ముందు.. రోడ్డు వ్యవహారం.. రాజకీయంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు సీఎం జగన్ చిన్నాన్న.. వైసీపీ కీలక నాయకుడు వైవీ సుబ్బారెడ్డి ఫాం హౌస్(వ్యవసాయ క్షేత్రం) కు సర్కారు.. అద్దం లాంటి రోడ్డు నిర్మించడం మరింత చర్చకు దారితీసింది.
ఎక్కడంటే..
బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం అనమనమూరు పంచాయతీ పరిధిలో వైసీపీముఖ్య నాయకుడు.. కాలం కలిసి వస్తే. త్వరలోనే రాజ్యసభకు కూడా వెళ్లనున్న వైవీ సుబ్బారెడ్డి సోదరులకు సుమారు వంద ఎకరాల మేర ఫాం హౌస్‌లు, పండ్ల తోటలు ఉన్నాయి. అక్కడకు చేరుకునేందుకు గతంలో మట్టి రోడ్డు ఉండేది. ఇటీవల ఉపాధి హామీ నిధులు రూ.30 లక్షలు వెచ్చించి 2.5 కి.మీ. మేర రోడ్డు వేసేశారు.
వాస్తవానికి ఈ మార్గంలో ఒక్క ఇల్లు లేకపోయినా సరే వైవీ సోదరుల కోసమే దీనిని నిర్మించారనే విమర్శలు వస్తున్నాయి. కొంత కాలం కిందట వైవీ ఆదేశించడం, అధికారులు స్వామి భక్తి చాటుకుంటూ ప్రజా ధనాన్ని వెచ్చించి ఈ రోడ్డు నిర్మించడం చకచకా జరిగిపోయాయి. ఇదీ.. సంగతి!!
This post was last modified on February 13, 2024 4:42 pm
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ అగ్రనేత. ఇక, ఆయన సొంత రాష్ట్రం గుజరాత్. తాజాగా మోడీ చిన్ననాటి స్నేహితుడు,…
విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…
మొన్న ఢిల్లీ బస్సులో ఓ అమ్మాయిని రేప్ చేస్తే నేడు హైదరాబాద్ లో ఒకరి తర్వాత మరొకరు, ఎక్కడ దొరికితే…
అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఏపీ తెలంగాణ హక్కులు యాభై అయిదు కోట్లకు…
ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇంతకుముందులా ఉదారంగా కొత్త సినిమాలను కొనట్లేదన్న సంగతి తెలిసిందే. నిర్మాతలు అడుగుతున్న రేట్లకు, వాళ్లు ఆఫర్…
కొందరు దర్శకులు టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమతో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…