తనపై విమర్శలు చేసే వారిని ఏ మాత్రం వదలని తీరు ఏపీ పీసీసీ రథసారధి షర్మిలలో కనిపిస్తుంటుంది. తనను అనే ప్రతి ఒక్కరికి వడ్డీతో సహా ఇచ్చుకునే ఆమె తాజాగా ఏపీ మంత్రి ఆర్కే రోజాపై విరుచుకుపడ్డారు. ఆమెపై ఘాటు విమర్శలు చేసిన షర్మిల.. సంచలన ఆరోపణలు చేశారు.
ఇప్పటివరకు రోజాపై ఎవరు చేయని సరికొత్త ఆరోపణలకు తెర తీశారు. ‘‘నగరి ఎమ్మెల్యే జబర్దస్త్ రోజా. నియోజకవర్గంలో అంతా జబర్దస్త్ దోపిడీ.. ఈవిడతో పాటు రోజా అన్నలు, భర్త కలిపి నగరి నియోజకవర్గానికి నలుగురు మంత్రులు. ఇసుక, మట్టి, గ్రావెల్, స్థలాలు ఇలా అన్నీ దోపిడీ. ఎక్కడ చూసినా అవినీతే” అంటూ ఫైర్ అయ్యారు.
రోజాను ఒకప్పుడు ఐరెన్ లెగ్ అనే వారన్న విషయాన్ని గుర్తు చేసిన షర్మిల.. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పంచె విప్పి కొడతానంటూ ఆమె చేసిన మాటలు తనకు ఇంకా గుర్తున్నాయన్నారు. తన గురించి మాట్లాడే అర్హత రోజాకు లేదన్నారు. తనను ప్రేమించినంతగా వైఎస్సార్ ఎవరినీ ప్రేమించలేదన్న ఆమె.. ‘‘నోరుంది కదా అని పారేసుకోకు. తెలంగాణలో నాపై అధిక ప్రసంగం చేసిన వాళ్లను జనాలు ఓడగొట్టిన విషయాన్ని గుర్తుంచుకో. వారంతా ఇప్పుడు ఇంట్లో కూర్చున్నారు. రేపు రోజా గతి కూడా అంతే. బాపట్లలో ఒకతను నాపై ఇష్టానుసారం మాట్లాడాడు. వైఎస్సార్ బిడ్డను కాబట్టే అడుగు బయట పెట్టగలిగిందన్నాడు. ఒక్క నిమిషం నేను వైఎస్సార్ బిడ్డను కాదనే విషయాన్ని పక్కన పెడతా. ఎవరొస్తారో.. ఎంతమంది వస్తారో రండి. ఎవరేంటో చూసుకుందాం’’ అని నిప్పులు చెరిగారు.
వైసీపీ కోసం తాను మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశానన్న షర్మిల.. వైసీపీ మొక్కగా ఉన్నప్పుడు తాను ఎరువు వేశానని చెప్పారు. ‘ఇప్పుడు చెట్టు అయ్యాక నా అవసరం లేదంటున్నారు. ఆడబిడ్డ అని కూడా చూడకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని మండిపడ్డారు. తెలంగాణలో తమ పార్టీని మూసేశారంటూ చేస్తున్న విమర్శలకు ఆమె సమాధానం ఇచ్చారు. తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశానని.. కాంగ్రెస్ ఉన్నంతవరకు తమ పార్టీ ఉన్నట్లేనని వ్యాఖ్యానించారు.
గొప్ప ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీలోకి తమ పార్టీని విలీనం చేశానని చెప్పిన షర్మిల.. ‘ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు అన్నీ వస్తాయి. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన డబ్బులు తేవాలంటూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి నేను డబ్బులు తీసుుకొస్తే మీరేమైనా గాడిదలు కాస్తున్నారా? కేసీఆర్ తో ఇన్నాళ్లు స్నేహం చేశారు కదా. మరి రాష్ట్ర విభజన సమస్యలు అప్పడు కనిపించలేదా?’’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
This post was last modified on February 12, 2024 4:02 pm
నిన్న విడుదలైన గేమ్ ఛేంజర్ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోనప్పటికీ మిక్స్డ్ టాక్ తోనూ క్రమంగా పుంజుకుంటుందనే నమ్మకంలో…
రాయలసీమ అంటేనే… ఫ్యాక్షన్ గొడవలకు పెట్టింది పేరు. నిత్యం వైరి వర్గాలపై దాడులు చేసుకుంటూ కాలం వెళ్లదీసే ఇక్కడి వారిలో…
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం డాకు మహారాజ్ ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస హిట్లతో మంచి జోరు…
విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు మరో కీలక మలుపు తీసుకుంది. గోపాలపురం ఎయిర్పోర్టు…
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందగా 40…
2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత…