13వ తేదీన ఒకేరోజు తెలంగాణాలో రెండు కీలకమైన ఘటనలు జరగబోతున్నాయి. మొదటిదేమో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మేడిగడ్డ బ్యారేజి సందర్శన. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలు, అవినీతిని వివరించేందుకు రేవంత్ రెడీ అయ్యారు. నాసిరకం నిర్మాణం కారణంగానే కొన్ని పిల్లర్లు కుంగిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయమై జరిగిన విజిలెన్స్ విచారణలో భారీ ఎత్తున అవినీతి జరిగినట్లు నిర్ధారణయ్యింది. నివేదిక ప్రకారం సుమారు రు. 4 వేల కోట్ల దోపిడి జరిగిందట.
విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా విచారణను మరింత లోతుగా చేయించాలని రేవంత్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. అందుకనే ప్రాధమికంగా ఇరిగేషన్ రంగంలోని నిపుణులు, అధికారపార్టీ నేతలతో కలిసి రేవంత్ బ్యారేజిని సందర్శించబోతున్నారు. కాబట్టి దానికి సంబంధించి జరిగిన అవినీతిపై చాలా డీటైల్డ్ గా రేవంత్ జనాలకు వివరించబోతున్నారు. అదే రోజు నల్గొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగసభ జరగబోతోంది. రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి మొదలవ్వబోతున్న ప్రచార సభలో కేసీయార్ పాల్గొనబోతున్నారు.
ప్రమాదం జరిగి విశ్రాంతి తీసుకున్న తర్వాత కేసీయార్ పాల్గొనబోతున్న మొదటి బహిరంగసభ ఇదే. అందుకనే సుమారు 2 లక్షల మంది జనసీమకరణతో భారీ బహిరంగసభకు పార్టీ ప్లాన్ చేసింది. జిల్లాలోని అన్నీ నియోజకవర్గాల నుండి బహిరంగసభకు జనాలను సమీకరించేందుకు కేసీయార్ ఇదివరకే నియోజకవర్గాల ఇన్చార్జీలను కూడా నియమించారు. తెలంగాణాలోని నీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ)కి అప్పగించటంపై కేసీయార్ ఎక్కువగా టార్గెట్ చేయబోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాల వల్ల నీటి ప్రాజెక్టులకు ఏ విధంగా నష్టం జరుగుతుంది ? దక్షణి తెలంగానా ఎడారిగా మారబోతోందన్న విషయాన్ని జనాలకు వివరించేందుకు కేసీయార్ ప్లాన్ చేస్తున్నారు.
మొత్తానికి రేవంత్, కేసీయార్ మీటింగుల్లో సబ్జెక్టు ఒకటేకాని భిన్న కోణాలను జనాలు చూడబోతున్నారు. కేసీయార్ ఏమో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయబోతున్నారు. ఇదే సమయంలో రేవంతేమో ప్రాజెక్టుల దోపిడికి కేసీయార్ కుటుంబం పాల్పడిందన్న విషయాన్ని జనాలకు వివరించేందుకు అవసరమైన మెటీరియల్ ఇప్పటికే కలెక్టు చేశారు. అందుకనే 13వ తేదీన రేవంత్-కేసీయార్ మధ్య బిగ్ ఫైట్ జరగబోతోందనే ప్రచారం ఊపందుకుంది.
This post was last modified on February 12, 2024 10:06 am
నిన్న విడుదలైన గేమ్ ఛేంజర్ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోనప్పటికీ మిక్స్డ్ టాక్ తోనూ క్రమంగా పుంజుకుంటుందనే నమ్మకంలో…
రాయలసీమ అంటేనే… ఫ్యాక్షన్ గొడవలకు పెట్టింది పేరు. నిత్యం వైరి వర్గాలపై దాడులు చేసుకుంటూ కాలం వెళ్లదీసే ఇక్కడి వారిలో…
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం డాకు మహారాజ్ ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస హిట్లతో మంచి జోరు…
విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు మరో కీలక మలుపు తీసుకుంది. గోపాలపురం ఎయిర్‌పోర్టు…
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందగా 40…
2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత…