కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల తాజాగా శపథం చేశారు. ఇప్పటి వరకు వైసీపీపై విమర్శలు చేస్తూ వచ్చిన షర్మిల.. తాజాగా తన సోదరుడు, సీఎం జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపేస్తానని శపథం చేశారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనలలో భాగంగా షర్మిల.. తాజాగా తిరుపతి జిల్లా నగరి నియోజకవర్గం(ఫైర్ బ్రాండ్ మంత్రి రోజా నియోజకవర్గం)లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమెకు ఇక్కడి పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తొలుత రోడ్ షోలో పాల్గొన్న షర్మిల.. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడారు.
ఏపీకి ప్రత్యేక హోదా రాని కారణంగా ఎంతో నష్టపోయాం. లేకపోతే వేల ఉద్యోగాలు వచ్చేవి. జగన్ ఓ నియంత. త్వరలోనే గద్దె దింపుతా. ఇది నా శపథం. మొన్న తెలంగాణలో నియంత కేసీఆర్‌ను గద్దె దింపా. త్వరలో ఏపీలో నియంతను గద్దె దింపడమే నా లక్ష్యం. వైఎస్సార్ ఆశయాలు అని అన్న ఎన్నో చెప్పారు, ఒక్క ఛాన్స్ అని అడిగారు.. కానీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయితే ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేయలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, సీఎం జగన్ కు నక్కకు, నాగ లోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది
అని షర్మిల వ్యాఖ్యానించారు.
వైఎస్సార్ హయాంలో రైతులకు సంక్షేమం, వారికి ఇన్‌పుట్ సబ్సిడీ, విత్తనాల మీద, డ్రిప్ మీద సబ్సిడీ ఇచ్చి వ్యవసాయం పండుగ చేశారని చెప్పారు. కానీ, నేడు జగన్ హయాంలో వ్యవసాయం దండగ అనేది దాగి ఉందని చెప్పారు. రాష్ట్రంలో అప్పులు లేని రైతు ఒక్కరు కూడా లేరని షర్మిల వ్యాఖ్యానించారు. రూ.300 కోట్లతో రైతులకు స్థిరీకరణ నిధితో మద్దతు వచ్చేలా వ్యవస్థ ఏర్పాటు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. రూ.4000 కోట్లతో రైతులకు నష్టపరిహార నిధి అని చెప్పి, ఒక్క ఏడాది కూడా ఇంప్లిమెంట్ చేయకుండా మోసం చేశారు. డబ్బు లేని కారణంగా చదువు ఆగిపోకూడదని, మెడిసిన్, ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ ఏది చదివినా ఉచితంగా చదించారని, కానీ జగన్ పాలనలో ఫీజు రీయింబర్స్ మెంట్ రావడం లేదు
అని షర్మిల విరుచుకుపడ్డారు.
ఇలాంటి పాలన మనకు అవసరమా? ఇసుక దోచుకుంటున్నారు. మట్టి దోచుకుంటున్నారు. పొరుగు రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్లా మనకు నాయకులు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిందే. నేను మళ్లీ మళ్లీ చెబుతున్నా.. ఇది నా శపథం
అని షర్మిల తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. కాగా.. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిందే అనే వ్యాఖ్యలను ఆమె 12 సార్లు చేయడం గమనార్హం. అదేసమయంలో ఇది నియంత ప్రభుత్వం అని 10 సార్లు వ్యాఖ్యానించారు. చిత్రం ఏంటంటే.. ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు.. జనాల నుంచి రియాక్షన్ జోరుగా కనిపించింది.
This post was last modified on February 12, 2024 8:26 am
నిన్న విడుదలైన గేమ్ ఛేంజర్ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోనప్పటికీ మిక్స్డ్ టాక్ తోనూ క్రమంగా పుంజుకుంటుందనే నమ్మకంలో…
రాయలసీమ అంటేనే… ఫ్యాక్షన్ గొడవలకు పెట్టింది పేరు. నిత్యం వైరి వర్గాలపై దాడులు చేసుకుంటూ కాలం వెళ్లదీసే ఇక్కడి వారిలో…
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం డాకు మహారాజ్ ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస హిట్లతో మంచి జోరు…
విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు మరో కీలక మలుపు తీసుకుంది. గోపాలపురం ఎయిర్పోర్టు…
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందగా 40…
2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత…