Political News

కృష్ణా నుంచి గోదావ‌రి వ‌ర‌కు.. టీడీపీ వ‌దులుకోవాల్సిందేనా?

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి టీడీపీ పెట్టుకుంటున్న పొత్తుల‌తో ఆ పార్టీ నాయ‌కులు చాలా వ‌ర‌కు సీట్ల ను వ‌దులుకోవాల్సి వ‌స్తోంది. ఇది ఎంత‌గా అంటే.. కృష్నా జిల్లా నుంచి ఉభ‌య గోదావ‌రి జిల్లాల వ‌ర‌కు కూడా.. పెద్ద ఎత్తున కీల‌క స్థానాల‌ను వ‌దిలేయాల్సి వ‌స్తోంది. గ‌తంలో అయితే.. టీడీపీకి అటు ఇటుగా ఉన్న స్థానాల‌ను మిత్ర‌ప‌క్షాల‌కు కేటాయించార‌నే అప‌వాదు ఉంది. కానీ, ఇప్పుడు మిత్ర‌ప‌క్షాలు కూడా.. తెలివిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. త‌మ‌కు బ‌లం ఎలా ఉన్నా.. టీడీపీ బ‌లం ఉన్న చోట స్థానాల‌నే కోరుతున్నాయి.

ఉదాహ‌ర‌ణ‌కు.. పెడ‌న నియోజ‌క‌వ‌ర్గం టీడీపీకి కంచుకోట‌. కానీ, దీనిని జ‌న‌సేన ప‌ట్టుబ‌డుతోంది. కైక‌లూరు నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ నేత‌ల హ‌వా ఎక్కువ‌గా ఉన్న స్థానం. దీనిని బీజేపీ కోరుతున్న‌ట్టు తెలుస్తోంది. అదేవిధంగా విజ‌యవాడ ఎంపీ స్థానం.. టీడీపీ సిట్టింగు స్థానం. కానీ, దీనిని ఇచ్చి తీరాల‌ని బీజేపీ అల్టిమేట్ జారీ చేస్తున్న‌ట్టు పార్టీలో చ‌ర్చ సాగుతోంది. ఇక‌, ఇదే జిల్లాలోని టీడీపీ క‌చ్చితంగా గెలుస్తుంద‌నే అంచ‌నా ఉన్న‌.. మ‌చిలీప‌ట్నం టికెట్‌ను జ‌న‌సేన‌కు ఇచ్చే శారు.

అదేవిధంగా అవనిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిస్థితి కూడా డోలాయ‌మానంలో ఉంది. ఇక‌, ఉమ్మ‌డి ప‌శ్చిమ లోనూ తాడేప‌ల్లి గూడెం నుంచి ఆచంట వ‌ర‌కు.. సుమారు నాలుగు స్థానాల‌ను జ‌నసే న కోరుతోంది. అదేవిధంగా టీడీపీకి కంచుకోట‌ల వంటి.. తూర్పుగోదావ‌రి జిల్లాల్లోని రాజ‌మండ్రి స్థానాన్ని.. జ‌న‌సేనకు ఇప్ప‌టికే ఇచ్చారు. అయినా.. ఎంపీ స్థానం కోసం ప‌ట్టుబ‌డుతున్నారు. అయితే.. దీనిపై టీడీపీ నిక్క‌చ్చిగా.. కాద‌ని చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది.

మ‌రోవైపు.. గుంటూరు స్థానం ఎంపీ టికెట్‌ను ఇప్ప‌టికే పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌కు టీడీపీ కేటాయించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. కానీ, ఇప్పుడు ఆయ‌న‌ను ఆగాలంటూ.. పైనుంచి ఆదేశాలు రావడం గ‌మ‌నార్హం. ఇక్క‌డ నుంచి బీజేపీ పోటీ చేయాల‌ని చూస్తోంది. పురందేశ్వ‌రి కి విశాఖ‌ను ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. వాస్త‌వానికి ఈ టికెట్‌ను బాల‌య్య అల్లుడు.. భ‌ర‌త్‌కు కేటాయించారు. కానీ, ఈ సారి త‌ప్ప‌ద‌ని.. బీజేపీ ప‌ట్టుబ‌డుతోంది. ఇలా.. మొత్తంగా టీడీపీ కంచుకోట‌ల‌పైనే.. బీజేపీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on February 11, 2024 2:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తేజ సజ్జ మెచ్యూరిటీని మెచ్చుకోవచ్చు

అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…

4 hours ago

జనసేన, శివసేనల లక్ష్యం అదే: పవన్

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…

4 hours ago

ఆరెంజ్ హీరోయిన్ పెళ్లి కుదిరింది

అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…

4 hours ago

పుష్ప 2 హంగామా వేరే లెవెల్

టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…

5 hours ago

కాంట్రాక్లర్ల జీవితాలు జగన్ నాశనం చేశాడు

విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…

5 hours ago

ఓట్ల కోసం రాలేదు.. మరాఠా గడ్డపై పవన్

మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…

5 hours ago