ప్రత్యేక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాసనసభలో తొలిసారిగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆర్థిక శాఖా మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు భట్టి. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క తమ ప్రభుత్వం చేపట్టిన, చేపట్టబోతోన్న పథకాల గురించి వివరించారు. రైతులకు రుణమాఫీ అమలు చేయబోతున్నామన్నారు. రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలోనే విధివిధానాలు రూపొందిస్తున్నామని అన్నారు.
ప్రతి పంటకు మద్దతు ధర కూడా కల్పిస్తామన్నారు.
మూసీ నది ప్రక్షాళనకు రూ.1000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నామని, హైదరాబాద్ మెడలో అందమైన హారంలా ఆ నదిని తీర్చిదిద్దుతామమని భట్టి అన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా పాతబస్తీలోని పాదచారుల జోన్‌లు, పీపుల్స్ ప్లాజాలు, హెరిటేజ్ జోన్‌లు, హాకర్స్ జోన్‌లు, చిల్డ్రన్స్ థీమ్ పార్కులు, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌లను డెవలప్ చేస్తామన్నారు. రాష్ట్రంలోని అర్హులైన కుటుంబాలకు గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందించబోతున్నామని తెలిపారు.
ఆల్రెడీ కేబినెట్ ఆమోదం పొందిన ఆ పథకం అమలుకు బడ్జెట్‌లో రూ. 2,418 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలోని ట్రాన్స్‌కో, డిస్కమ్‌లకు రూ. 16,825 కోట్లు ప్రతిపాదించారు. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తామన్నారు. ప్రతి మండలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అధునాతన వసతులతో తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు రూ.500 కోట్లు ప్రతిపాదించారు.
తెలంగాణ బడ్జెట్ 2024-25 హైలైట్స్ ఇవే
తెలంగాణ రాష్ట్ర 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్
బడ్జెట్ 2,75,891కోట్లు.
6 గ్యారెంటీల కోసం 53196 కోట్లు అంచనా.
పరిశ్రమల శాఖ 2543 కోట్లు.
ఐటి శాఖకు 774కోట్లు.
పంచాయతీ రాజ్ 40,080 కోట్లు.
పురపాలక శాఖకు 11692 కోట్లు.
మూసీ రివర్ ఫ్రాంట్ కు వెయ్యి కోట్లు.
వ్యవసాయ శాఖ 19746 కోట్లు.
ఎస్సి, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం 1250 కోట్లు.
ఎస్సి సంక్షేమం 21874 కోట్లు.
ఎస్టీ సంక్షేమం 13013 కోట్లు.
మైనార్టీ సంక్షేమం 2262 కోట్లు.
బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం 1546 కోట్లు.
బీసీ సంక్షేమం 8 వేల కోట్లు.
విద్యా రంగానికి 21389 కోట్లు.
తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు 500 కోట్లు.
యూనివర్సిటీల్లో సదుపాయాలకు 500 కోట్లు.
వైద్య రంగానికి 11500 కోట్లు.
విద్యుత్ – గృహ జ్యోతికి 2418 కోట్లు.
విద్యుత్ సంస్థలకు 16825 కోట్లు.
గృహ నిర్మాణానికి 7740 కోట్లు.
నీటి పారుదల శాఖ కు 28024 కోట్లు.
This post was last modified on February 10, 2024 3:55 pm
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…
అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…
టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…
విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…
మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…