Political News

టీడీపీతో పొత్తుపై అమిత్ షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీతో పొత్తు విష‌యంపై బీజేపీ అగ్ర‌నాయ‌కుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “అవును.. ఎన్డీయేలోకి కొత్త మిత్రులు వ‌స్తున్నారు“ అని  వ్యాఖ్యానించారు. ఏపీలో పొత్తులు త్వరలోనే కొలిక్కి వస్తాయని చెప్పారు. అయితే.. ఈ పొత్తులపై ఇప్పుడే ఏం మాట్లాడలే నని అన్నారు. అయితే.. కేంద్ర స్థాయిలో ఎన్డీయేని బ‌లోపేతం చేయాల‌ని నిర్ణ‌యించుకు న్న‌ట్టు షా తెలిపారు.  400 స్థానాలు ద‌క్కించుకుని మ‌రోసారి విజ‌యం సాధించాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు.

ఈ క్ర‌మంలో క‌లిసి వ‌చ్చేవారితో క‌లిసి ముందుకు సాగుతామ‌న్నారు. దీనిలో ఏపీ మిత్రులు కూడా ఉన్నార‌ని.. అయితే.. దీనిపై ఇంకా పూర్తిస్థాయిలో స‌మాచారం రావాల్సి ఉంద‌న్నారు. “కుటుంబ పరంగా ప్యామిలీ ప్లానింగ్ బావుంటుంది. కానీ, రాజకీయంగా ఎంత పెద్ద కూటమి ఉంటే అంత మంచిది“ అని షా అన్నారు.  అంతేకాదు.. బీజేపీతో క‌లిసిఉంటామ‌ని వ‌చ్చిన వారికి తాము ఎప్పుడూ రెడ్ కార్పెట్ ప‌రిచామ‌న్నారు. కొంద‌రు త‌మ‌ను వ‌దులుకుని వెళ్లార‌ని.. తాము వారిని కాద‌ని అనుకోలేద‌ని వ్యాఖ్యానించారు. పంజాబ్‌లో అకాలీదళ్‌తో చర్చలు నడుస్తాయన్నారు.

ఇదిలావుంటే.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు రెండు రోజుల కింద‌ట ఢిల్లీలో ప‌ర్య‌టించి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. బీజేపీతో ఆయ‌న పొత్తు పెట్టుకునేందుకు సిద్ధ‌మ‌వ‌తున్నారు. ఈ నేప‌థ్యంలో అమిత్‌షా.. స‌హా ఇత‌ర నేత‌ల‌ను ర‌హ‌స్యంగా క‌లిసి వ‌చ్చారు. పొత్తులు, సీట్ల పంపకాలపై వారితో చ‌ర్చించిన‌ట్టు జాతీయ మీడియాలోనూ క‌థ‌నాలు వ‌చ్చాయి.  అయితే.. దీనిపై ఇంకా ఎలాంటి పూర్తిస్థాయి స‌మాచారం రాలేదు. కానీ, తాజాగా అమిత్‌షా చేసిన వ్యాఖ్య‌ల‌తో టీడీపీతో పొత్తుకు  బీజేపీ దాదాపు మాన‌సికంగా రెడీ అయిన‌ట్టుగానే ఉంద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. 

Share
Show comments
Published by
Satya

Recent Posts

తేజ సజ్జ మెచ్యూరిటీని మెచ్చుకోవచ్చు

అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…

4 hours ago

జనసేన, శివసేనల లక్ష్యం అదే: పవన్

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…

4 hours ago

ఆరెంజ్ హీరోయిన్ పెళ్లి కుదిరింది

అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…

5 hours ago

పుష్ప 2 హంగామా వేరే లెవెల్

టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…

5 hours ago

కాంట్రాక్లర్ల జీవితాలు జగన్ నాశనం చేశాడు

విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…

5 hours ago

ఓట్ల కోసం రాలేదు.. మరాఠా గడ్డపై పవన్

మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…

5 hours ago