Political News

చిలక‌లూరిపేట లో వార్ వ‌న్‌సైడ్ అయ్యిందా?

ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని చిల‌క‌లూరి పేట నియోజ‌క‌వ‌ర్గంలో ఈ సారి టీడీపీ పాగా వేస్తుందా? టీడీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు గెలుపు త‌థ్య‌మా? ఆయ‌న ఖ‌చ్చితంగా మ‌ళ్లీ శాస‌న‌స‌భ‌లో అడుగు పెడ తారా? అంటే గుంటూరు జిల్లా పొలిటిక‌ల్ వాతావ‌ర‌ణంతో పాటు జిల్లా రాజ‌కీయ విశ్లేష‌కులు నూటికి నూరు శాతం అవున‌నే అంటున్నారు. దీనికి కార‌ణం.. గ‌త ఐదేళ్ల‌లో నియోజ‌క‌వ‌ర్గంలో ఎలాంటి అభివృద్ధీ లేక‌పోవ‌డం, వైసీపీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లే. ప్ర‌స్తుతం పేట నుంచి మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ నుంచి వైసీపీకి జంప్ చేసి గెలిచిన ర‌జ‌నీ ఆ త‌ర్వాత మంత్రి అయినా కూడా నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ది లేదు. వైసీపీలో ఎమ్మెల్సీ మ‌ర్రి రాజ‌శేఖర్ గ్రూప్‌తో ఆమెకు అస్స‌లు స‌ఖ్య‌త లేదు. తాజాగా ఆమెను గుంటూరు వెస్ట్‌కు బ‌దిలీ చేశారు. వాస్త‌వానికి ఇలా బ‌దిలీ చేశారంటేనే.. అక్క‌డ ఆమెపై వ్య‌తిరేక‌త ఉంద‌ని పార్టీ ప‌రోక్షంగా ఒప్పుకొన్న‌ట్టే క‌దా! ఇక‌, ఈ స్థానంలో మ‌ల్లెల రాజేష్ నాయుడు అనే కొత్త వ్య‌క్తిని తీసుకువ‌చ్చి.. ఇక్క‌డ వైసీపీ ఇంచార్జ్‌గా నియ‌మించారు.

కానీ, ఆయ‌న ఎమ్మెల్యే స్థాయికి స‌రితూగే నాయ‌కుడు కాద‌నే చ‌ర్చ పార్టీలోనే ఉంది. పైగా ఆర్థికంగాను, అంగ బ‌లంగా చూసుకున్నా.. ఆయ‌న‌.. ప్ర‌త్తిపాటికి స‌రితూగే నాయ‌కుడు కాద‌ని అంటున్నారు. దీంతో టీడీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు గెలుపు ప‌క్కా అన్న వాతావ‌ర‌ణ‌మే ఉంది. ఆయ‌న గ‌తంలో చేసిన అభివృద్ధి, నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న ప‌లుకుబ‌డి, ఆర్థికంగా ద‌న్ను. . వంటివి ప్ర‌త్తిపాటికి తిరుగులేకుండా చేస్తున్నాయి.

కొత్త ఇన్‌చార్జ్ మ‌ల్లెల రాజేష్ నాయుడు కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు కావ‌డం.. స్థానికంగా క‌మ్మ వ‌ర్గం, బీసీలు ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో వైసీపీ తీసుకువ‌చ్చిన ఈ ఈక్వేష‌న్ వ‌ర్కవుట్ కావ‌డం క‌ష్ట‌మ‌నేది ప‌రిశీల‌కుల అంచ‌నా. దీనికితోడు వైసీపీలో ఎవ‌రికి వారుగా ఉన్న నాయ‌కులు.. మ‌ల్లెల‌కు ఏమేర‌కు మేలు చేస్తారు. ఎలా క‌లిసి వ‌స్తారు? ప్ర‌చారం ఏం చేస్తారు? అనే విష‌యాలు కూడా.. చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. ఎమ్మెల్సీ మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌.. వ‌ర్గం ఆయ‌న‌కు దూరంగా ఉంటోంది.

ప్ర‌స్తుతం మ‌ర్రికి ఎమ్మెల్సీ ఇచ్చినా.. ఆయ‌న‌కు మం త్రి ప‌ద‌వి ఇస్తామ‌న్న హామీని ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం జ‌గ‌న్ అమ‌లు చేయ‌లేదు. దీంతో ఆయ‌న ఆవేద‌నలోనే ఉన్నారు. సో.. ఆయ‌న క‌ల‌సి వ‌చ్చే అవ‌కాశం లేదు. గ‌తంలో ర‌జ‌నీకి స‌పోర్ట్ చేసిన కొంద‌రు కీల‌క నేత‌లు కూడా ఇప్పుడు సైలెన్స్ పాటిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మ‌ల్లెల‌కు స‌హాయ నిరాక‌ర‌ణ ఎదుర‌య్యే అవ‌కాశం క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇది పుల్లారావుకు గెలుపును గోల్డెన్ ప్లేట్‌లో పెట్టి అందిస్తుంద‌ని అంటున్నారు.

This post was last modified on February 9, 2024 5:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆరెంజ్ హీరోయిన్ పెళ్లి కుదిరింది

అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…

49 mins ago

పుష్ప 2 హంగామా వేరే లెవెల్

టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…

52 mins ago

కాంట్రాక్లర్ల జీవితాలు జగన్ నాశనం చేశాడు

విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…

53 mins ago

ఓట్ల కోసం రాలేదు.. మరాఠా గడ్డపై పవన్

మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…

55 mins ago

ధనుష్ మీద భగ్గుమన్న నయనతార

కోలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతారకు కోపం వచ్చింది. హీరో ధనుష్ మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మూడు పేజీల…

4 hours ago

అకీరా సంగీతానికి తమన్ గైడెన్స్

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…

7 hours ago