కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు ఎట్టకేలకు భద్రతను పెంచారు. రాష్ట్ర డీజీపీ ఉత్తర్వుల మేరకు ప్రస్తుతం ఉన్న వన్ ప్లస్ వన్ గన్ మెన్ సెక్యూరిటీ నుండి టూ ప్లస్ టూ గా పెంచారు. భద్రతా ప్రమాణాల నిబంధనల(స్కేల్) మేరకు సెక్యూరిటీ కల్పించినట్టు అధికారులు తెలిపారు. ఎవరైనా వ్యక్తుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, వారికి గన్ మెన్లను కేటాయించమని ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చే సిఫారసు (సెక్యూరిటీ రివ్యూ కమిటీ) నివేదిక మేరకు గన్ మెన్లను కేటాయించినట్టు తెలిపారు.
వైఎస్ షర్మిల రెండు రోజుల క్రితం తనకు భద్రత కల్పించాలని బహిరంగంగానే డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో షర్మిల రాష్ట్రవ్యాప్తంగా పీసీసీ అధ్యక్షురాలు హోదాలో పర్యటిస్తున్నారు. అయితే.. ఆమెకు ఆదిలో ఉన్న 2+2 భద్రతను 1+1కు తగ్గించారు. ఈ నేపథ్యంలో ఆమె బుధవారం కూడా.. తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.
దీనికి తోడు.. కాంగ్రెస్ నాయకులు కూడా డీజీపీకి పలు మార్లు ఉత్తరాలు రాశారు. దీంతో స్థానికంగా ప్రోటోకాల్ అంశాలను పరిగణలోకి తీసుకొని భద్రత ఏర్పాటు చేయడంగమనారహం. దీంతోషర్మిలకు వన్ ప్లస్ వన్ గన్ మెన్ సెక్యూరిటీ నుండి టూ ప్లస్ టూ గా మార్పు చేశారు. ప్రస్తుతం షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. రచ్చబండ కార్యక్రమాలు సహా రోడ్ షోలలోనూ ఆమె పాల్గొంటున్నారు. దీంతో ఆమె భద్రతపై పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిందే.
This post was last modified on February 8, 2024 6:09 pm
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…