వైసీపీ టికెట్ దక్కక పోవడంతో పార్టీ నుంచి బయటకు వచ్చిన ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు అన్యాయం జరిగిందని, అయి తే.. జగన్‌పై తన కుటుంబానికి ప్రత్యేక అభిమానం ఉందని.. ఆయనకు వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితిలోనూ ప్రచారం చేయనని ఆయన చెప్పుకొచ్చారు. “మా ఇంటికి మీరు రండి. ఎటు చూసిన .. జగన్, వాళ్ల నాయన ఫొటోలే కనిపిస్తాయి. మా ఇంట్లో ఓదార్పు యాత్ర పాటలు కూడా వినిపిస్తాయి” అని మీడియా మిత్రులతో కాపు చెప్పుకొచ్చారు.
తాజాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వచ్చిన ఆయన సభలో కంటే కూడా..లాబీల్లోనే ఎక్కువగా గడిపారు. ఇదే సమయంలో టీడీపీ పక్ష కార్యాలయానికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ ఎమ్మెల్యే లతో కలిసి టీ తాగారు. వారితో కొన్ని నిమిషాల పాటు చర్చలు జరిపారు. బడ్జెట్ ఎలా ఉందని ఇరు పక్షాల మధ్య ఆసక్తికర వ్యాఖ్యలు చోటు చేసుకున్నాయి. అనంతరం.. కాపు మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడుతూ.. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమేనని చెప్పారు.
అయితే.. స్వతంత్రంగానా? లేక వేరే పార్టీ నుంచా? అనేది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. ఎలా పోటీ చేసినా.. జగన్‌కు వ్యతిరేకంగా మాత్రం ప్రచారం చేసుకోనని.. తన బలంపైనే తాను గెలుస్తానని అన్నారు. “నాకొక ఇమేజ్ ఉందబ్బా. దాన్ని వదులుకుంటామా ఏంటి? జగన్‌మీద ప్రచారం చేస్తే.. వెయ్యి ఓట్లుకు మించి రావు. నా గురించి చెప్పుకుంటే ఖచ్చితంగా గెలుస్తాం. ఆ మాత్రానికి ఆయనను డ్యామేజీఎందుకు చేయాలి. అంతా దేవుడే చూసుకుంటాడులే” అని వ్యాఖ్యానించారు.
This post was last modified on February 8, 2024 2:13 pm
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…