Political News

భగీరథలో వేల కోట్ల అవినీతి జరిగిందా ?

మిషన్ భగీరథ ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందా ? అవుననే సమాధానం వినిపిస్తోంది ప్రభుత్వ వర్గాల నుండి. మిషన్ భగీరథ పేరుతో కేసీయార్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు చాలా ప్రాంతాల నుండి ప్రభుత్వానికి పిర్యాదులు అందుతున్నట్లు సమాచారం. ఫిర్యాలన్నింటినీ రేవంత్ రెడ్డి ముందుంచారు ప్రభుత్వ అధికారులు. వీటిని పరిశీలించిన రేవంత్ వెంటనే విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు తెలిసింది.

కేసీయార్ అధికారంలో ఉన్నపుడు ఈ పథకంపై అనేక ఆరోపణలున్నాయి. అయితే అప్పట్లో దేనిపైనా ప్రభుత్వం స్పందించలేదు. అలాంటిది ప్రభుత్వం మారగానే ఫిర్యాదులు కుప్పలు కుప్పలుగా వస్తున్నాయట. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత తక్కువలో తక్కువ రు. 7 వేల కోట్ల అవినీతి జరిగుంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకనే అవినీతి ఎంతన్నది నిగ్గుతేల్చేందుకే విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ప్రతి ఊరికి పైప్ లైన్ వేసి ఇంటింటింకి మంచినీటి సౌకర్యం అందించేందుకు ఏర్పాటైందే మిషన్ భగీరధ ప్రాజెక్టు.

అయితే ఇక్కడ విషయం ఏమిటంటే తెలంగాణా రాష్ట్రం ఏర్పడేటప్పటికే చాలా గ్రామాల్లో మంచినీటి సౌకర్యం ఉంది. గ్రామాల మధ్య పైపులైన్లు వేసి ఇంటింటికి నల్లాలు బిగించటం ఒకటే మిగిలింది. ఇక్కడే అవినీతికి తెరలేచిందట. ఎలాగంటే పైప్ లైన్లు వేయకుండానే వేసినట్లు బిల్లులు పెట్టుకున్నారట. మెటీరియల్ కొనకుండానే కొన్నట్లు ఫేక్ బిల్లులు చూపి డబ్బులు తీసుకున్నారట. ఇంట్రా విలేజ్ వర్క్స్ లో పెద్దఎత్తున గోల్ జరిగినట్లు ఆరోపణలు పెరిగిపోతున్నాయి.

వస్తున్న ఆరోపణలను దృష్టిలో పెట్టుకుని ప్రతిమండలంలోని ఒక గ్రామాన్ని శాంపుల్ గా తీసుకోవాలని విజిలెన్స్ ను రేవంత్ ఆదేశించారట. గ్రామాల మధ్య అప్పటికే ఉన్న పైప్ లైన్లను కొత్తగా వేసినట్లు చూపించి వేలకోట్ల రూపాయల బిల్లులు కాజేసినట్లు ఆరోపణలు వినబడుతున్నాయి. అప్పట్లో ముఖ్యమంత్రి కార్యాలయంలో పథకాన్ని పర్యవేక్షించిన ఉన్నతాధికారి పాత్రపైన కూడా ఆరోపణలు వినబడుతున్నట్లు సమాచారం. అందుకే వీటన్నింటిపైనా సమగ్ర విచారణ జరిపించాలని రేవంత్ ఆదేశించింది. ప్రాజెక్టు కోసం 30 వేల కోట్ల రూపాయలను కేసీయార్ ప్రభుత్వం అప్పుచేసినట్లు లెక్కలు చెబుతోంది. మరి ఎంత సద్వినియోగం అయ్యింది ఎంత అవినీతి జరిగిందన్నది తేలాలి.

This post was last modified on February 7, 2024 11:55 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎన్నో ట్విస్టులతో… డ్రీమ్ లవ్ స్టోరీకి బ్రేకప్

క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన పెళ్లి ఆగిపోయింది. ఒక సినిమాను మించిన మలుపులతో సాగిన స్మృతి మంధాన,…

2 hours ago

లేటు వయసులో అదరగొడుతున్న అక్షయ్

మొన్నటి తరం లెజెండరీ హీరో వినోద్ ఖన్నా వారసుడిగా 1997లో బాలీవుడ్ కు వచ్చాడు అక్షయ్ ఖన్నా. కెరీర్ ప్రారంభంలో…

3 hours ago

కోహ్లీ 100 సెంచరీలు: సచిన్ రికార్డు సాధ్యమేనా?

సౌతాఫ్రికా సిరీస్‌లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…

5 hours ago

మణిరత్నంతో సాయిపల్లవి – సేతుపతి సినిమా ?

పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…

5 hours ago

కొత్త ప్రభాస్‌… వంగ టచ్ కనిపిస్తోంది

‘బాహుబలి’ కోసం ఐదేళ్ల పాటు ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో.. రెండు పార్ట్స్‌లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడో తెలిసిందే. కానీ అంత…

5 hours ago

అమెరికాలో లోకేష్ ను ఆపిన పోలీసులు…

తన జీవితంలో జరగని సంఘటన ఇప్పుడు జరిగిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.…

6 hours ago