Political News

కూటమిదే పై చేయా ?

తొందరలోనే జరగబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమిదే పైచేయా ? తాజాగా వెల్లడైన ఒక సర్వే ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. రైజ్ అనే సంస్థ ఏపీలోని రాజకీయ పరిస్ధితులపై సర్వే జరిపించింది. అందులో రెండుపార్టీల కూటమిదే పై చేయని స్పష్టంగా తేలిందట. సర్వే వివరాల ప్రకారం కూటమికి 94 స్ధానాలు దక్కుతాయి. వైసీపీకి 46 సీట్లు వస్తాయి. మిగిలిన 35 నియోజకవర్గాల్లో మూడుపార్టీల మధ్య హోరాహోరీ జరుగుతుందని తేలిందట.

అయితే సర్వేలో కొన్ని కీలకమైన పాయింట్లు ఉన్నాయి. అదేమిటంటే రెండు పార్టీలతో పాటు బీజేపీ కలిస్తుందా లేదా అన్నది కీలకమైనది. బీజేపీ కూడా కలిస్తే కూటమి సీట్లు తగ్గిపోతాయట. బీజేపీ కలవకపోతేనే 94 సీట్లు వస్తాయని తేలిందట. ఎందుకంటే జనాలు బీజేపీపైన బాగా మండిపోతున్నారన్న విషయం సర్వే సందర్భంగా బయటపడిందట. అందుకని పొత్తులో బీజేపీని కలుపుకుంటే దాని ప్రభావం మిగిలిన రెండుపార్టీలు కూడా భరించాల్సుంటుందని తేలిందట. అందుకని రైజ్ సంస్ధ కూడా టీడీపీ, జనసేన పొత్తు ప్రభావంపైన మాత్రమే సర్వేచేసిందని అర్ధమవుతోంది.

పోయిన ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు రావటంలో నాలుగు జిల్లాలు కీలకపాత్ర పోషించాయి. రాయలసీమలోని కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. కడపలో పది సీట్లు, కర్నూలులో 14 నియోజకవర్గాలు, నెల్లూరులోని పది, విజయనగరం జిల్లాలోని 9 స్ధానాల్లో టీడీపీకి ఒక్కటంటే ఒక్కసీటు కూడా దక్కలేదు. పైగా నాలుగు జిల్లాలే వైసీపీకి 33 నియోజకవర్గాలను అందించాయి. అయితే రాబోయే ఎన్నికల్లో వైసీపీకి అంత సీనుండదని తేలిందట.

కడప జిల్లా పరిస్ధితి కాస్త అయోమయంగా కనిపించినా మిగిలిన కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో వైసీపీకి ఏకపక్ష ఫలితాలు రావని మాత్రం తేలిపోయిందట. పైగా కొన్ని జిల్లాల్లో బాగా వ్యతిరేకత ఉందని కూడా అర్ధమైందని రైజ్ చెప్పింది. రాయలసీమలోని 52 నియోజకవర్గాల్లో పోయిన ఎన్నికల్లో వైసీపీ 49 చోట్ల గెలిచింది. రాబోయే ఎన్నికల్లో కూటమి అధికారపార్టీకి చాలా నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇవ్వబోతున్నట్లు తేలిందట. అయితే కూటమి గెలుచుకునే సీట్లు, టైట్ ఫైట్ లాంటి వివరాలను ప్రకటించలేదు. ఏదేమైనా రైజ్ తాజా సర్వే ప్రకారం కూటమిదే అధికారమని తేలిపోయింది.

This post was last modified on February 6, 2024 10:21 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చైతూ-శోభితల పెళ్లిపై నాగ్ బిగ్ అప్డేట్

టాలీవుడ్ లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్లల పెళ్లి విషయం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సమంతతో…

3 mins ago

గౌతమ్ అదానీ ఇష్యూపై వైట్ హౌస్ రియాక్షన్ ఇదే

బిలియనీర్.. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అదానీ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసు క్రియేట్ చేసిన కార్పొరేట్ సంచలనం…

45 mins ago

యాక్షన్ లో ప్రభాస్ – డ్యాన్స్ లో చిరు తాత!

అల్లు అర్జున్ త‌న‌యుడు అల్లు అయాన్ త‌న అల్ల‌రి చేష్ట‌లతో ఎంత ఫేమ‌స్ అయ్యాడో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు…

1 hour ago

IPL షెడ్యూల్.. బీసీసీఐ బిగ్ సర్‌ప్రైజ్

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. సమీపంలోనే జరగబోయే మూడు ఐపీఎల్ సీజన్ల తేదీలను ముందుగానే…

2 hours ago

రాహుల్ ఔట్: ఇది న్యాయమేనా?

పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఫాస్ట్ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా…

2 hours ago