చడీచప్పుడు లేకుండా తెలుగు రాష్ట్రాల్లో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు రాష్ట్రాల మధ్య ప్రైవేటు బస్సులు తిరిగేస్తున్నాయి. ఇందుకు ఇరు ప్రభుత్వాల నుంచి అనుమతులు లభించాయి. శనివారం నుంచే బుకింగ్స్ మొదలయ్యాయి. ఆల్రెడీ బస్సులు తిరిగేస్తున్నాయి. ఓవైపు హైదరాబాద్-విజయవాడ-విశాఖపట్నం.. మరోవైపు హైదరాబాద్-కర్నూలు-కడప-కర్నూలు మార్గాల్లో బస్సులు నడిపిస్తున్నారు. రెడ్ బస్, అబి బస్ లాంటి యాప్స్‌లో జోరుగా బుకింగ్స్ నడుస్తున్నాయి. కొన్ని బస్సుల్లో సోషల్ డిస్టెన్సింగ్‌తో సీటింగ్ ఏర్పాట్లు చేసి ఎక్కువ రేటుకు టికెట్లు అమ్ముతున్నారు. మరికొన్ని బస్సుల్లో అదేమీ లేదు.
ఇక ఆర్టీసీ బస్సుల సంగతే తేలాల్సి ఉంది. ఈ విషయంలో మూడు నెలలుగా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య ప్రతిష్ఠంభన నెలకొంది. రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల మధ్య ఎడతెగని చర్చలు జరిగినా ఫలితం లేకపోయింది. ఏపీకి తమ బస్సుల సంఖ్య పెంచి ఆదాయం పెంచుకోవాలని తెలంగాణ చూస్తుండగా.. ఈ ప్రతిపాదనను ఏపీ అంగీకరించట్లేదు. తమ రాష్ట్రానికి అటు నుంచి ఎన్ని బస్సులు వస్తాయో అన్నే బస్సులు తామూ నడుపుతామని తెలంగాణ అంటోంది. అలా చేస్తే తమకు ఆదాయం పడిపోతుందని ఏపీ అభ్యంతరపెడుతోంది. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నారు. గత నాలుగు నెలలుగా ప్రజలు సొంత వాహనాలు, అద్దె కార్లతోనే ఇటు అటు రాకపోకలు సాగిస్తున్నారు.
This post was last modified on September 8, 2020 3:48 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…