Political News

టార్గెట్ 17: సీఎం రేవంత్ దూకుడు

వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌లే ధ్యేయంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి బ‌ల‌మైన అడుగులు వేస్తున్నారు. అధికారంలోకి వ‌చ్చేముందు ప్ర‌క‌టించిన ఆరు గ్యారెంటీల్లో తాజాగా మ‌రో రెండు గ్యారెంటీల‌ను ఆయ‌న ప‌చ్చ జెండా ఊపారు. తాజాగా జ‌రిగిన కేబినెట్‌లో భేటీలో సీఎం రేవంత్ ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు. క్షేత్ర‌స్థాయిలో అత్యంత ప్ర‌భావం చూపించ‌గ‌ల‌ 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 గ్యాస్ సిలిండర్ పథకాలకు మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఇది చాలా కీల‌క‌మైన నిర్ణ‌య‌మ‌ని సీఎం రేవంత్ అభిప్రాయ‌ప‌డ్డారు.

వాహనాల నెంబర్ ప్లేట్‌లలో టీఎస్‌కు(TS) బదులుగా టీజీగా(TG) మారుస్తూ సీఎం రేవంత్ ఆధ్వ‌రంలో జ‌రిగిన కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేస‌మ‌యంలో తెలంగాణ తల్లి రూపురేఖల్లోనూ మార్పులు చేయనున్నారు. ఈ మేర‌కు కేబినెట్ తీసుకున్న ప‌లు నిర్ణయాలను మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వెల్లడించారు.

ఇవీ.. కీల‌క నిర్ణ‌యాలు

  • పేద‌ల‌కు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు
  • అర్హులైన వారికి రూ.500 గ్యాస్ సిలిండర్ త‌క్ష‌ణ అమ‌లు
  • ‘జయ జయహే తెలంగాణ’ గేయాన్ని రాష్ట్ర గేయంగా మార్పు
  • తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు రాష్ట్ర చిహ్నంలోనూ మార్పులు
  • తెలంగాణ ఆత్మ కనిపించేలా రాష్ట్ర రాజముద్రలో మార్పు
  • సీఎం రేవంత్ సొంత నియోజ‌క‌వ‌ర్గంలో కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు
  • ఐటీఐ కాలేజీలకు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌గా అప్‌గ్రేడ్
  • నూతన హై కోర్టుకు భూ కేటాయింపు
  • వ్యవసాయ శాఖలోని ఖాళీల భ‌ర్తీ
  • డిసెంబ‌రు నాటికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ

This post was last modified on February 5, 2024 10:12 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తేజ సజ్జ మెచ్యూరిటీని మెచ్చుకోవచ్చు

అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…

2 hours ago

జనసేన, శివసేనల లక్ష్యం అదే: పవన్

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…

2 hours ago

ఆరెంజ్ హీరోయిన్ పెళ్లి కుదిరింది

అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…

3 hours ago

పుష్ప 2 హంగామా వేరే లెవెల్

టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…

3 hours ago

కాంట్రాక్లర్ల జీవితాలు జగన్ నాశనం చేశాడు

విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…

3 hours ago

ఓట్ల కోసం రాలేదు.. మరాఠా గడ్డపై పవన్

మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…

3 hours ago