రాబోయే పార్లమెంటు ఎన్నికల కోసం తెలంగాణా కాంగ్రెస్ లో పోటీ పెరిగిపోయింది. టికెట్ల కోసం ఇంతమంది దరఖాస్తులు చేస్తారని పార్టీ నాయకత్వమే ఊహించలేదు. మొత్తం 17 నియోజకవర్గాలకు 306 మంది నేతలు దరఖాస్తులు చేశారు. అంటే సగటున ఒక్కో నియోజకవర్గానికి 18 దరఖాస్తులు వచ్చినట్లయ్యింది. వీటిల్లో అత్యధికంగా ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ నియోజకవర్గాల్లో పోటీకి పోటీ చాలా తీవ్రంగా ఉన్నట్లు పార్టీవర్గాల సమాచారం. కారణం ఏమిటంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వచ్చింది సింపుల్ మెజారిటి మాత్రమే. 119 నియోజకవర్గాల్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా గెలుచుకోవాల్సిన సీట్లు 61 మాత్రమే. కాంగ్రెస్ కు వచ్చింది కేవలం 64 సీట్లు మాత్రమే. అంటే చాలా సింపుల్ మెజారిటితో పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి సింపుల్ మెజారిటితో వచ్చిన పార్టీకి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎందుకింత పోటీ ఉన్నట్లు ?
ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పాలనలో ప్రభుత్వంపై జనాల్లో సానుకూలత బాగా పెరుగుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సిక్స్ గ్యారెంటీస్ లో ఇప్పటికే రెండు అమల్లోకి తెచ్చారు. మరో రెండింటిని తొందరలోనే అమలు చేయబోతున్నారు. మిగిలిన రెండు హామీల అమలుకు కసరత్తులు జరుగుతున్నాయి. హామీల అమలును పక్కన పెట్టేస్తే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగానే రేవంత్ మొదలుపెట్టిన ప్రజాదర్బార్ కు జనాల్లో మంచి స్పందన మొదలైంది.
రెండున్నర నెలల పాలనలో ఎక్కడా ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకోలేదు. కేసీయార్ పదేళ్ళపాలనలో జనాల్లో పెరిగిపోయిన అసంతృప్తిని రేవంత్ తగ్గిస్తున్నారు. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై జనాల్లో సానుకూల స్పందన పెరుగుతోంది. అందుకనే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేస్తే గెలుపు ఖాయమని నేతల్లో నమ్మకం పెరిగిపోతోంది. అందుకనే టికెట్ల కోసం ఇంత పోటీ పెరిగిపోతోంది. ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల్లో కాంగ్రెస్ దాదాపు స్వీప్ చేసేసింది. అదే రిజల్టు రిపీట్ అవుతుందన్న నమ్మకంతోనే టికెట్ల కోసం నేతలు పెద్దఎత్తున ప్రయత్నాలు చేసుకుంటున్నారు. చివరకు టికెట్లు ఎవరికి దక్కుతాయో చూడాలి.
This post was last modified on February 6, 2024 10:11 am
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. వైసీపీ హయాంలోనే రాష్ట్రంలో సంపద సృష్టి జరిగిందని చెప్పుకొచ్చారు.…
జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ప్రసాదం…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సారథ్యంపై సొంత పార్టీలోనే లుకలుకలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి పార్టీ అధ్యక్షుడిగా రాహుల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ఆనంద పడుతున్నారా? సంతోషంగానేఉన్నారా? ఇదీ.. ఇప్పు డు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండి…
హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా పట్టువదలని విక్రమార్కుడిలా తన సినిమాలను తమిళంతో సమాంతరంగా తెలుగులోనూ విడుదల చేయిస్తున్న హీరో సిద్దార్థ్…