Political News

వెంక‌య్య, అద్వానీ.. మోడీ వ్యూహంలో నెక్ట్స్ ఎవ‌రు?

వ‌చ్చే ఎన్నికల్లో మూడో సారి ముచ్చ‌ట‌గా విజ‌యం ద‌క్కించుకుని దేశంలోనే రికార్డు సృష్టించాల‌ని భావి స్తున్న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఆదిశ‌గా అడుగులు ముమ్మ‌రంగా ముందుకు వేస్తున్నారు. ఒక‌వైపు ప్ర‌జ‌ల‌ను, మ‌రోవైపు మ‌త ప్రాతిప‌దికన కూడా ఆయ‌న ఆక‌ర్షిస్తున్నారు. ఇన్ని చేసినా.. పార్టీ ప‌రంగా కూడా.. త‌న ప్ర‌భావాన్ని కోల్పోకుండా ఉండేలా చాలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. దీనిలో బాగంగా.. బీజేపీ పాత‌త‌రం నాయ‌కుల‌కు మోడీ అవార్డుల వీర‌తాళ్లు వేస్తున్నారు. దీనికి కార‌ణ‌మేంటి? త‌ర్వాత వ‌రుసలో ఎవ‌రున్నారు? అనేది ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌.

ఇప్ప‌టి వ‌ర‌కు చూసుకుంటే గ‌త వారంలోనే ఇద్ద‌రు కీల‌క నాయ‌కుల‌కు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ దేశ అత్యు న్న‌త పౌర పుర‌స్కారాల‌ను ప్ర‌క‌టించారు. వీరిలో ద‌క్షిణాదికి చెందిన ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు, ఉత్త‌రాదికి చెందిన లాల్ కృష్ణ అద్వానీ ఉన్నారు. వీరిద్ద‌రూ బీజేపీకి స‌మ ఉజ్జీలు. 90ల‌లో దేశ‌వ్యాప్తంగా బీజేపీని ప‌రుగులు పెట్టించ‌డంలో వీరి కృషిని ఎవ‌రూ తీసేయ‌లేదు. అయితే.. మోడీ పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. వీరి ప్ర‌భ త‌గ్గిపోయింది. వివిధ కారణాల‌తో వీరిని బీజేపీ ప‌క్క‌న పెడుతూ వ‌చ్చింది.

ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి వెంక‌య్య‌ను త‌ప్పించారు. ఆయ‌న‌కు ఉప రాష్ట్ర‌ప‌తి ప‌ద‌విని క‌ట్టబెడుతూనే బీజేపీలో జోక్యం చేసుకోకుండా అచేత‌నం చేశార‌నే వాద‌న అప్ప‌ట్లోనే వినిపించింది. ఇక‌, అద్వానీ వ‌యోవృద్ధులు కావ‌డం , మోడీ వ్యూహాలు వేరే ఉండ‌డంతో ఆయ‌న‌ను కూడా త‌ప్పించారు. మొత్తంగా వీరి ప్రాదాన్యం లేకుండా పోయింది. కానీ, బీజేపీలో వీరు వేసిన పునాదులు మాత్రం సుస్థిరంగా ఉన్నాయి. దీంతో త‌ర‌చుగావీరి ప్ర‌స్తావ‌న వ‌స్తూనే ఉంది. ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలోన అన్ని వ‌ర్గాల‌ను త‌న‌వైపు తిప్పుకోవాలంటే.. వ‌దిలేసిన వారికి కూడా.. ప్రాధాన్యం ఇవ్వ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి మోడీకి ఏర్ప‌డింది.

ఈ క్ర‌మంలోనే ప్ర‌ధాని మోడీ వెంక‌య్య‌కు ప‌ద్మ‌విభూష‌ణ్‌, అద్వానీకి తాజాగా భార‌త రత్న ప్ర‌క‌టించార‌నే చర్చ సాగుతోంది. వీరికి తాను ప్రాధాన్యం ఇస్తున్నాన‌ని, వ‌దిలేయ‌లేద‌ని త‌ద్వారా.. మోడీ బ‌ల‌మైన సంకేతాలు ఇచ్చి.. పార్టీలో త‌న ఆదిప‌త్యం నిలుపుకొనే ప్ర‌య‌త్నం చేశారు. ఇక‌, ఈ వ‌రుస‌లో మిగిలింది మ‌రో ఇద్ద‌రు కీల‌క నాయ‌కులు. వారే..ఫైర్ బ్రాండ్‌ ఉమాభార‌తి, ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి. అయితే.. వీరికి ఇప్ప‌టికిప్పుడు ఎలాంటి అవార్డులు ప్ర‌క‌టించ‌క‌పోయినా.. రాజ్య‌స‌భ‌కు పంపించే అవ‌కాశం ఉండ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా.. బీజేపీపై మోడీ ప్ర‌భావం త‌గ్గకుండాచూసుకునేందుకు అవార్డుల పంట పండిస్తున్నార‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on February 4, 2024 4:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మోదీ ఊరికి చైనా అధ్యక్షుడితో అనుబంధం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌తో పాడ్‌కాస్ట్‌లో పాల్గొని అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గుజరాత్‌లోని…

2 hours ago

మోకాళ్లపై వెంకన్న చెంతకు టాలీవుడ్ హీరోయిన్

హీరోయిన్ లు అంటే... చాలా సున్నితంగా, సుకుమారంగా ఉంటారు. అయితేనేం... వారిలోని భక్తి ఒక్కోసారి వారి చేత వండర్లు చేయిస్తూ…

2 hours ago

బన్నీకి ఫుల్ రిలీఫ్ దొరికేసింది!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఇప్పుడు నిజంగానే ఫుల్ రిలీఫ్ దొరికిందని చెప్పాలి. తన తాజా చిత్రం…

4 hours ago

ప్రభాస్ పెళ్లి సస్పెన్స్ తీరబోతోందా

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్యాగ్ ని సంవత్సరాల తరబడి మోస్తున్న ప్రభాస్ పెళ్లి శుభవార్తని వినాలనే కొద్దీ ఆలస్యమవుతూనే…

4 hours ago

పండుగ పూట ఈ ట్రోలింగ్ ఏంటబ్బా…?

వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతగా ఓ రేంజిలో ఎలివేషన్లు దక్కించుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా నిజంగానే పండుగ పూట…

5 hours ago

మోక్షజ్ఞ కోసం ఎదురుచూపులు ఎప్పటిదాకా

గత డిసెంబర్ లో సర్వం సిద్ధం చేసుకుని పూజా కార్యక్రమాలతో సినిమా మొదలవుతుందని అందరూ ఎదురు చూస్తున్న టైంలో మోక్షజ్ఞ…

5 hours ago