టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపింరచుకుని తీరాలనే కసితో ముందుకు సాగు తున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ ప్రస్తుతం అందివచ్చిన ఛాన్స్‌ను మిస్ చేసుకోకుండా ముందుకు సాగాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో అవసరమైతే.. రెండు మెట్లు దిగి ముందుకు సాగాలని చూస్తు న్నారు. ఇది రాజకీయంగా బాగానే ఉన్నప్పటికీ.. స్థానికంగా నాయకులు పెట్టుకున్న ఆశలపై మాత్రం నీళ్లు చల్లుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
ఉదాహరణకు అనంతపురం జిల్లాలోని కీలకమైన ధర్మవరం నియోజకవర్గంపై పరిటాల కుటుంబం చాలానే ఆశలు పెట్టుకుంది. గత ఎన్నికల్లోనూ.. ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి పోటీ చేయాలని భావిస్తోంది. కానీ, గత ఎన్నికల్లోనూ ఇప్పుడు కూడా.. ఒకే ఒక్క టికెట్‌ను ఈ కుటుంబానికి కేటాయిస్తున్నారు. మరోవైపు ఇతర కుటుంబాలకు .. ఇదే జిల్లాలో రెండేసి టికెట్‌లు ఇస్తున్నారు. ఇదే పరిటాల ఫ్యామిలీలో చర్చనీయాంశం అయింది. గత ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే కమ్ మంత్రిగా ఉన్న పరిటాల సునీత.. తన కుమారుడు.. శ్రీరాంను తెరమీదికి తెచ్చారు.
ఈ క్రమంలో ధర్మవరం(గతంలో పరిటాల రవి పోటీ చేసిన నియోజకవర్గం), రాప్తాడు రెండు నియోజకవర్గాలు కావాలని కోరారు. కానీ, అప్పట్లోనూ రాప్తాడు ఒక్కటే ఇచ్చారు. ఎవరైనా ఒక్కరే అంటూ.. ఒక నియోజకవర్గం ఇవ్వడంతో శ్రీరాం పోటీ చేశారు. గెలుపుపై భారీగానే అంచనాలు వచ్చినా.. వైసీపీ హవాలో ఆయన గెలుపు గుర్రం ఎక్కలేక పోయారు.ఇక, ధర్మవరం టికెట్ నుంచి పోటీచేసిన వరదాపురం సూచి..(గోనుగుంట్ల సూర్యనారాయణ) ఓడిపోయిన తర్వాత.. బీజేపీతీర్థం పుచ్చుకున్నారు.
దీంతో ధర్మవరంలోనే పాగా వేసిన శ్రీరాం.. గత రెండేళ్ల నుంచి ఇక్కడ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రెండు నెలలపాటు పాదయాత్ర కూడా చేశారు. అయితే.. ఇప్పుడు కూడా ఈ నియోజకవర్గం ఇచ్చే అంశంపై పార్టీలో చర్చ సాగుతోంది. ప్రస్తుతం రాప్తాడు నియోజకవర్గాన్ని మాత్రమే పరిటాల కుటుంబానికి కన్ఫర్మ్ చేశారు. అది కూడా సునీతకు మాత్రమే కేటాయించాలని తేల్చి చెప్పారు. ధర్మవరం నుంచి మళ్ల వరదాపురం సూరికే టికెట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన తర్వలోనే వస్తారని.. ఆయనకు టికెట్ ఇస్తున్నారని అంటున్నారు. ఈ విషయమే ఇప్పుడు పరిటాల కుటుంబంలోఆవేదనను మిగుల్చుతోంది. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on February 4, 2024 12:28 pm
ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ లో నటించాక ఏ హీరోయిన్ కైనా ఆఫర్ల వర్షం కురుస్తుంది. కానీ కెజిఎఫ్ రెండు భాగాల్లో…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు పెద్ద సినిమాలు సెట్స్ మీదుంచి వాటిని బ్యాలన్స్ చేయడం ఎంతటి అగ్ర నిర్మాతలకైనా సరే…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గాలి భానుప్రకాష్ నాయుడు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…
ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని…
దర్శకుడు, నటుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన ఏం మాట్లాడి నా ఆలోచించి.. మాట్లాడతారు.. ఏం…