ఏపీ సీఎం జగన్ తన చెల్లెళ్ల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ హనుమంతరావు (వీహెచ్) అన్నారు. సొంత చెల్లెలు వైఎస్ షర్మిల విషయంలో కొందరు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఇంత జరుగుతున్నా.. జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారు?
అని హనుమంతరావు ప్రశ్నించారు. మహిళల గురించి గొప్పగా మాట్లాడే.. జగన్, ముందుకు తన చెల్లెళ్ల గురించి పట్టించుకోవాలి
అని సూచించారు.
‘‘షర్మిల రాజశేఖర్ రెడ్డి కూతురు కాదు’’ అని ఆరోపణలు చేస్తూ వచ్చిన పోస్టర్లపై హనుమంతరావు కౌంటర్ ఇచ్చారు. తల్లిని, చెల్లిని జగన్ దూరం పెట్టాడు. సొంత చెల్లికి అవమానం జరుగుతుంటే ఆయనకు సంబంధం లేదన్నట్టుగా ఉన్నాడు. షర్మిల, సునీతలపై జగన్‌కు ఏమాత్రం ప్రేమ లేదని విమర్శించారు. సొంత చెల్లెళ్ళపై ప్రేమ లేని జగన్ మహిళా సాధికారత అని ముచ్చట్లు చెబుతున్నాడు
అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాజకీయాలు రాజకీయాలే. ఆ ముచ్చట వేరు. ఈ ముచ్చట వేరు
అని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
షర్మిల రాజశేఖర్ రెడ్డి కూతురు కాదని పోస్టులు పెడుతుంటే.. రక్త సంబంధం ఉన్న జగన్ ఎలా చూస్తూ ఊరుకుంటున్నాడని హనుమంతరావు అన్నారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయనకు, ఆయన పార్టీకి షర్మిల సేవ చేసిన విషయాన్ని మరిచిపోయా రా? అని ప్రశ్నించారు. రాజకీయాల కోసం జగన్ ఇంత దిగజారుతారా అని హనుమంతరావు మండిపడ్డారు. ఇప్పటికైనా చెడు సంప్రదాయాలని వీడి జగన్.. సరైన విధంగా వ్యవహరించాలని అన్నారు. అధికారం ఉందికదా.. అని ఇష్టాను సారం వ్యవహరిస్తే.. రేపు అదే ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.
రేపు విజయమ్మకైనా అంతే!
ఇప్పుడు షర్మిల విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని సీఎం జగన్ చూసీ చూడనట్టు రాజకీయం చేస్తున్నారని. రేపు తన తల్లి విజయమ్మ ఏపీలో అడుగు పెట్టి వ్యతిరేకంగా మాట్లాడినా.. ఇదే పనిచేస్తారని.. ఆమెపై పోస్టులు పెట్టినా.. వికృత ప్రచారం చేసినా.. మౌనంగా ఉంటారని హనుమంతరావు అన్నారు. ఈ రోజు చెల్లి.. రేపు తల్లి విజయమ్మ ఎందుకు కాకూడదని అన్నారు. షర్మిల ఏపీలో కాలు పెట్టినందుకు కాదు.. ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నందుకే.. జగన్‌కు భయం పట్టుకుందని అన్నారు.
This post was last modified on February 3, 2024 10:06 pm
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…