వైసీపీ అధినేత, సీఎం జగన్.. తాజాగా వచ్చే ఎన్నికలకు సంబంధించి సిద్ధం పేరుతో సభలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే విశాఖ వేదికగా.. ఆయన తొలిసభ నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాల వారీగా నిర్వహిస్తున్న ఈ సభల్లో భాగంగా ఏలూరు జిల్లా దెందులూరులో సభను నిర్వహించారు. ఈ సభా వేదికగా సీఎం జగన్ సంచలన పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ని గెలిపించాలని ఆయన చెప్పారు. అదేసమయంలో ఆయన చెయిన్ క్యాంపెయిన్ నిర్వహించాలని ప్రజలకు సూచించారు. ఇప్పటి వరకు ఇలాంటి పిలుపు ఏ పార్టీ కూడా ఇవ్వక పోవడం గమనార్హం.
రాష్ట్రంలో 57 నెలలుగా వైసీపీ పాలన సాగుతోంది. ఈ పాలనలో నేను 124 సార్లు బటన్ నొక్కాను. వివిధ పథకాల కింద 2 లక్షల 57 వేల కోట్ల రూపాయలను లబ్ధి దారులకు పంచాను. దీనివల్ల నా.. నా.. నా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కా చెల్లెమ్మ లు, అన్నాదమ్ములు, అవ్వా తాతలు లబ్ధిపొందారు. ఇక్కడ బటన్ నొక్కగానే అక్కడ వారి బ్యాంకు ఖాతాల్లో సొమ్ములు పడ్డా యి. దీని వల్ల మీకు మేలు జరిగిందా?
అని సభకు వచ్చిన వారిని సీఎం జగన్ ప్రశ్నించారు. దీనికి ప్రజలనుంచి మంచి స్పందన లభించింది. అనంతరం జగన్ మాట్లాడుతూ.. మీకు జరిగిన లబ్ధిని మీ పొరుగు వారికి కూడా తెలియజేయాలన్నారు.
అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ రాకపోతే.. మీకు పథకాలు అందవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సీఎం జగన్ పిలుపు నిచ్చారు. ఈ విషయాన్ని అక్కా చెల్లెమ్మలు, అవ్వాతాతలు.. ఒక్కొక్కరు.. మీ చుట్టుపక్కల ఉండే 10 మందికి చెప్పండి. వైసీపీకి ఓటు వేయకపోతే..ఏం జరుగుతుందో వారికి వివరించండి. మీ పథకాలు, మీ సంక్షేమం అన్నీ.. చంద్రముఖి (చంద్రబాబు ) ఎత్తుకు పోతాడని చెప్పండి.మీరే నాయకు స్టార్ క్యాంపెయినర్లు. మీరే మీ చుట్టుపక్కల ఉండే వారికి పెద్ద ఎత్తున ప్రచారం చేయండి. ఇదే మీరు నాకు ఇచ్చే కానుక.. నేను మీకు ఎన్నో కానుకలు ఇచ్చాను
అని జగన్ అన్నారు.
చెయిన్ క్యాంపెయన్ అంటే..
మల్టీ చెయిన్ బిజినెస్ గురించి అందరికీ తెలిసిందే. ఒకరు ఒక స్కీమ్‌లో చేరతారు. వారు ముగ్గురిని చేర్పిస్తారు. ఆ ముగ్గురు.. ఒక్కొక్కరు చొప్పున మరో ముగ్గురిని అంటే.. 9 మందిని చేర్పిస్తారు. ఈ తొమ్మిది మంది ఒక్కొక్కరు.. ముగ్గురేసి చొప్పు.. చేర్పిస్తే.. అది.. 27 మందికి చేరుతుంది.. ఇలా.. చెయిన్ బిజినెస్ అయి.. చివరకు కోట్ల మందికి చేరుతుంది. ఇదే ఇప్పుడు సీఎం జగన్ చెప్పిన ప్లాన్. ఒకరు పది మందికి.. ఆ పది మంది.. ఒక్కొక్కరూ మరో 10 మంది చొప్పున వైసీపీకి అనుకూలంగా ఓటేయాలని ప్రచారం చేయడమే సీఎం జగన్ చెప్పిన చెయిన్ క్యాంపెయిన్., ఇలా.. చేస్తే.. అనుకూల పవనాలు వైసీపీకి వీచి పార్టీల ప్రచారం.. మైకుల ప్రచారం కన్నా.. ప్రజల మౌత్ ప్రచారం జోరందుకుని గెలుపు తథ్యమని ఆయన భావిస్తుండవొచ్చు.
This post was last modified on February 3, 2024 10:05 pm
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర…
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…
రాజకీయ నేతలు సవాళ్లు చేయడం తెలుసు. అదే విధంగా ప్రతిజ్ఞలు చేయడం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా…