రాజకీయాల్లో తనకంటూ.. ప్రత్యేక ముద్ర వేసుకున్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. అందరూ ఆమెను దీదీ అని పిలుచుకుంటారు. అయితే. ఆమె ప్రత్యేకత ఏంటంటే..ఎప్పుడు ఎటు వైపు నిలబడతారో.. ఎప్పుడు ఎవరిని పొగుడుతారో చెప్ప డం కష్టం. ఏనిముషానికి ఆమె మనసు, నోరు.. ఎటు వైపు మలుపు తిరుగుతాయో కూడా చెప్పడం మరీ కష్టం. నిన్న మొన్నటి వరకు.. కాంగ్రెస్ పార్టీని భేష్ అంటూ.. కొనియాడిన దీదీ.. ఇటీవల కాలంలో తిట్టి పోస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక విజను పాడూ ఏమీ లేవని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
ఇక, ఇప్పడు.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరుగుతూ ఏకంగా సవాళ్లే రువ్వారు దీదీ. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కనీసంలో కనీసం 40 సీట్లు కూడా రాబోవని ఆమె చెప్పారు. అంతేకాదు.. అలహాబాద్, వారణాసి నియోజకవర్గాల్లో పోటీ చేసి.. గెలిచి చూపించగలరా? అని సవాల్ రువ్వారు. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ బీజేపీ గెలిచింది. వారణాసి ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2014, 2019 ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కారు. ఇక, యూపీలోని అలహాబాద్‌లోనూ బీజేపీ నేత శ్యామా చరణ గుప్తా విజయం సాధించారు. ఈ రెండు కూడా బీజేపీకి అత్యంత బలమైన నియోజకవర్గాలు. వీటిలోనే కాంగ్రెస్ గెలిచి చూపించాలని మమత సవాల్ రువ్వారు.
ఎందుకింత అక్కసు?
కీలకమైన పార్లమెంటు ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌తో మమత ఎందుకు ఇలా విభేదిస్తున్నారన్నదానికి కారణం వెతికిచూస్తే.. అత్యంత చిన్నగానే ఉంది. కానీ, మనసులో ఆమె బాధ వేరేగా ఉండడంతో ఇప్పుడు నిప్పులు చెరుగుతున్నారు. ఆమె చెబుతున్న కారణం.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తున్నారు. ఇది మమత అధీనంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌లో సాగుతోంది. అయితే.. ఈ యాత్ర రాష్ట్రంలోకి ప్రవేశించినప్పుడు తనకు చెప్పలేదన్నది ఆమె చెబుతున్న కారణం. కానీ, కాంగ్రెస్ నేతలు మాత్రం ముందుగానే డీజీపీకి, సీఎస్‌కు సమాచారం ఇచ్చామని అంటున్నారు.
ఇక, మమత మనసులో ఉన్న కారణం చూస్తే.. ఆమె ఇండియా కూటమిలో ఉన్నప్పుడు(ఇప్పుడు లేరు) దీనికి కన్వీనర్ కావాలని అనుకున్నారు. తద్వారా.. మోడీని ఓడిస్తే.. ప్రధాని కావాలనేది ఆమె ఆకాంక్ష. కానీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోక వచ్చాక.. ఇండియా కూటమికి తామే నేతృత్వం వహిస్తామని కుండబద్దలు కొట్టింది. ఈ క్రమంలోనే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను రంగంలోకిదింపింది. ఇదీ.. అసలు అక్కసు. ఈ కారణంగానే మమత చిర్రెత్తిపోతున్నారు. ఒక్క సీటు కూడా ఇచ్చేది లేదన్నారు. ఇక, ఇదే కారణంగా బిహార్ సీఎం నితీష్ కూడా కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకుని .. బీజేపీ పంచన చేరిన విషయం తెలిసిందే.
This post was last modified on February 3, 2024 1:55 pm
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…
అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…
టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…
విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…
మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…