Political News

వైసీపీ ఆరో జాబితా విడుద‌ల‌.. కానీ, ఈ ప్ర‌శ్న‌కు సమాధాన‌మేది?

ఏపీ అధికార పార్టీ వైసీపీ తాజాగా ఆరో జాబితాను విడుద‌ల చేసింది. పార్ల‌మెంటు, అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను పుర‌స్క‌రించుకుని ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ లేదా షెడ్యూల్‌కు రెండు మాసాల ముందుగానే అభ్య‌ర్థుల‌ను దాదాపు నియమిస్తోంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు జాబితాలు ఇవ్వ‌గా తాజాగా ఆరో జాబితాను విడుద‌ల చేసింది. ఈ జాబితాలో అటు పార్ల‌మెంటు, ఇటు అసెంబ్లీల‌కు క‌లిపి 10 మంది స‌మ‌న్వ‌య క‌ర్త‌ల‌ను ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు పార్టీ కీల‌క నేత‌, ప్ర‌భుత్వ‌ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి, మంత్రి మేరుగ నాగార్జున‌లు ఆరో జాబితాను విడుద‌ల చేశారు.

ఇదీ.. ఆరో జాబితా!

రాజమండ్రి ఎంపీ స్థానం – గూడూరి శ్రీనివాస్,

నరసాపురం ఎంపీ స్థానం- గూడూరి ఉమాబాల

గుంటూరు ఎంపీ స్థానం – ఉమ్మారెడ్డి రమణ

చిత్తూరు ఎంపీ(ఎస్సీ) – రెడ్డప్ప

గిద్దలూరు ఎమ్మెల్యే- నాగార్జున రెడ్డి

నెల్లూరు సిటీ- ఎండీ ఖలీల్

జీడీ నెల్లూరు ఎమ్మెల్యే(ఎస్సీ) – కె.నారాయణ స్వామి,

ఎమ్మిగనూరు- బుట్టా రేణుక

మైలవరం – తిరుపతిరావు,

మార్కాపురం – రాంబాబుల‌ను స‌మ‌న్వ‌య క‌ర్త‌లుగా నియ‌మించారు.

ఈ ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మేదీ?

స‌మ‌న్వ‌య క‌ర్త‌లుగా నియ‌మిస్తున్న‌వారి విష‌యంలో పార్టీ అధిష్టానం త‌డ‌బ‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల కులు. వాస్త‌వానికి ఒక్క‌సారి జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకుంటే ఇక‌, వెన‌క్కి తీసుకోర‌ని ఆపార్టీ నేత‌లే ప్ర‌చారం చేస్తున్నారు. దీంతో స‌మ‌న్వ‌య క‌ర్త‌లుగా నియ‌మితులైన వారు వారి ప‌నిని వారు చేసుకుని పోతున్నారు. కొంద‌రు న‌చ్చ‌నివారు.. పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయారు. అయితే.. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఐదో జాబితాలోనూ.. ఇప్పుడు విడుద‌ల చేసిన ఆరో జాబితాలోనూ.. అభ్య‌ర్థుల మార్పు స్ప‌ష్టంగా క‌నిపించింది.

గ‌త జాబితాలో తిరుప‌తి ఎంపీగా నియ‌మించిన స‌త్య‌వేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వ‌ద్ద‌ని వెళ్లిపోయారు. దీంతో ఆ స్థానానికి వేరే వారిని నియ‌మిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు.కానీ, అనూహ్యంగా ఎమ్మెల్యే స్థానానికి పంపించిన ఎంపీ గురుమూర్తిని తీసుకువ‌చ్చి మ‌ళ్లీ తిరుప‌తికి కేటాయించారు. ఇక‌, ఇప్పుడు ఇచ్చిన జాబితాలోనూ ఇలాంటి మార్పే క‌నిపించింది. చిత్తూరు ఎంపీగా ఉన్న రెడ్డ‌ప్ప‌ను అసెంబ్లీకి పంపించారు. అదేవిధంగా గంగాధ‌ర నెల్లూరు ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే క‌మ్ మంత్రిగా ఉన్న నారాయ‌ణ‌స్వామిని చిత్తూరు ఎంపీగా పంపించారు.కానీ, తాజా జాబితాలో వీరిని తిరిగి య‌థాస్థానానికి తీసుకువ‌చ్చారు. మ‌రి ఇదేం మార్పు ? అనేది వైసీపీనాయ‌కుల ప్ర‌శ్న‌. దీనిపై అధిష్టానం మాత్రం మౌనంగా ఉంది. 

This post was last modified on February 3, 2024 8:45 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తేజ సజ్జ మెచ్యూరిటీని మెచ్చుకోవచ్చు

అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…

2 hours ago

జనసేన, శివసేనల లక్ష్యం అదే: పవన్

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…

2 hours ago

ఆరెంజ్ హీరోయిన్ పెళ్లి కుదిరింది

అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…

3 hours ago

పుష్ప 2 హంగామా వేరే లెవెల్

టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…

3 hours ago

కాంట్రాక్లర్ల జీవితాలు జగన్ నాశనం చేశాడు

విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…

3 hours ago

ఓట్ల కోసం రాలేదు.. మరాఠా గడ్డపై పవన్

మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…

3 hours ago