టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ మరోసారి జనంలోకి రానున్నారు. ఈ నెల 5, 6 తేదీల నుంచి ఉత్తరాంధ్ర పర్యటనకు రెడీ అవుతున్నారు. శంఖారావం పేరుతో ఆయన మూడు జిల్లాల్లో సభలకు సిద్ధమవుతున్నారు. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటించను న్న ఆయన.. శంఖారావం పేరుతో సభలు నిర్వహిస్తారు. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ పరంగా ఇప్పటికే రాష్ట్రంలో ఊపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలో ప్రచారపర్వంలోనూ పార్టీ దూకుడుగా ఉంది. ఎట్టి పరిస్తితిలోనూ టీడీపీని గెలిపించుకోవా లన్న సంకల్పంతో ఉండడంతో నారా కుటుంబం మొత్తంగా రాజకీయ బాట పట్టింది. ఇదిలావుంటే.. ఇప్పుడు చేపట్టనున్న శంఖారావానికి ప్రత్యేక ఏంటంటే.. గత ఏడాది జనవరి 27న ప్రారంభించిన యువగళం పాదయాత్ర కొంత గ్యాప్ వచ్చింది. అనివార్య కారణాలతో యువగళం పాదయాత్ర నిడివిని తగ్గించుకున్నారు. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కీలకమైన వాటిని వదిలేశారు.
ఈ నేపథ్యంలో యువగళం పాదయాత్ర కవర్ చేయని ప్రాంతాల్లో ఇప్పుడు శంఖారావం పేరుతో నారా లోకేష్ భారీ సభలు నిర్వహించాలని పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే ఆయన ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలను ఎంచుకున్నారు. ఈ సభల ద్వారా.. ప్రజలకు ఆయన చేరువకానున్నారు. ఈ నెల 5వ తేదీన ఇచ్ఛాపురం నియోజకవర్గంలో నారా లోకేష్ శంఖారావం సభను ప్రారంభిస్తారు.
అనంతరం.. 6వ తేదీన పాలకొండ చేరుకుని, 7న పాలకొండ, కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాల్లో సభలు పెడతారు. 8న సాలూరు, బొబ్బిలి, రాజాంలో జరిగే సభల్లో పాల్గొంటారు. 9న చీపురుపల్లి, ఎచ్చెర్ల, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. 10న విజయనగరం, గజపతినగరం, శృంగవరపుకోట నియోజకవర్గాల్లో పర్యటించి.. సభల్లో పాల్గొననున్నారు. అదేవిధంగా. పార్టీ కార్యక్రమాలు..అభ్యర్థుల పనితీరును కూడా తెలుసుకోనున్నారు.
This post was last modified on February 2, 2024 2:01 pm
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…