Political News

ఇది ఎన్నిక‌ల బ‌డ్జెట్‌ అని చెప్ప‌క‌నే చెప్పేశారు

ముసురుకొస్తున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో తాజాగా కేంద్రం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్టెట్‌.. ఆస‌క్తిగా నిలి చిందనే చెప్పాలి. ఎలాంటి శ‌ష‌భిష‌ల‌కు తావు లేకుండా.. ఇది ఎన్నిక‌ల బ‌డ్జెట్‌ అని చెప్ప‌క‌నే చెప్పేశారు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌. పైకి ఓటాన్ అకౌంట్ బ‌డ్జెట్ అయిన‌ప్ప‌టికి… కేంద్రంలోనే కాదు.. రాష్ట్రాల్లో ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకునే దీనిని వండి వార్చ‌డం ఆన‌వాయితీ. దీనికి భిన్నంగా మోడీ ప్ర‌భుత్వం కూడా ముందుకు పోలేదు.

ముఖ్యంగా 2014 నుంచి అంటే.. దాదాపు ప‌ది సంవ‌త్స‌రాల నుంచి ఎదురు చూస్తున్న వేత‌న జీవుల‌కు ఈ బ‌డ్జెట్‌లో ఊర‌ట ల‌భించింద‌నేది విశ్లేష‌కుల మాట‌. అయితే.. ఇది కొంత వ‌ర‌కు వాస్త‌మనే చెప్పాలి. ఎందుకంటే.. 2015-16, 2018-19, 2021-22, 2022-23లో వేత‌న జీవుల ప్ర‌స్తావ‌న మ‌చ్చుకైనా లేకుండానే బ‌డ్జెట్‌ను రూపొందించారు. కేవ‌లం 2016-17, 2020-21 బ‌డ్జెట్‌లో మాత్ర‌మే జీత‌గాళ్ల గురించి కొంత ప్ర‌స్తావించారు.వాటితో పోల్చుకుంటే.. ప్ర‌స్తుతం వేత‌న జీవుల గురించి ఆలోచించారు.

ప్ర‌స్తుతం ఆదాయ ప‌న్ను శ్లాబు.. 2.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ఎలాంటి వ‌సూళ్లు లేవు. ఇక‌, ఇక్క‌డ నుంచి 5 ల‌క్ష‌ల మ‌ధ్య చూపించే ఆద‌య ప‌న్ను ప‌రిమితి లెక్క‌ల‌ను అంచ‌నా వేసి. వాటిపైనా ప‌న్ను మిన‌హాయింపులు ఇచ్చారు. అంటే. వాస్త‌వ ప‌న్ను మిన‌హాయింపు ఇప్ప‌టికీ 2.5 ల‌క్ష‌ల వ‌ర‌కు మాత్ర‌మే ఉంది. త‌ర్వాత‌.. ఉద్యోగులు సంపాయించుకునే సొమ్ముపై లెక్క‌లు చూపించారు. దీనిని ఉద్యోగ సంఘాలు అనేక సంద‌ర్భాల్లో ఎత్తి చూపించాయి.

స‌రే.. ప్ర‌స్తుతం ప్ర‌క‌టించిన దానిలో 7 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అంటే.. ఇప్పుడున్న మిన‌హాయింపులు రూ.2 ల‌క్ష‌ల‌కు పెంచారు. కానీ, ద్ర‌వ్యోల్బ‌ణం ఆధారిత ఆదాయాన్ని అంచ‌నా వేస్తున్నప్పుడు.. స‌గటున వేత‌నాలు.. 1 ల‌క్ష వ‌ర‌కు పెంచుకునే అవ‌కాశం ఉంద‌ని.. గ‌త బ‌డ్జెట్‌లోనే ప్ర‌తిపాదించారు. ఈ ప్ర‌కారం చూసుకున్న‌ప్పుడు.. ఉన్న‌త స్థాయి, ఎగుమ మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఉద్యోగి ఆదాయాలు.. ర‌మార‌మి.. ల‌క్ష వ‌ర‌కు ఉంది.

దీనిలో వెసులు బాటు లేకుండా.. గుండుగుత్త‌గా 7 ల‌క్ష‌ల‌కు ప్ర‌క‌టించ‌డం.. ఎన్నిక‌ల హంబ‌క్కే న‌న్న‌ది విశ్లేష‌కుల అంచ‌నా. ఇక‌, 7 ల‌క్ష‌ల కు కూడా.. ప‌న్ను ప‌రిమితిలో య‌థాత‌థంగా వివిధ స్కీమ్‌లు.. ఇత‌ర‌త్రా పెట్టుబడుల మిన‌హాయింపు ఇవ్వ‌లేదు. కాబ‌ట్టి.. ప‌న్ను ప‌రిమితి.. అంకెల రూపంలో పెరిగినా.. సంఖ్యాప‌రంగా.. మాత్రం 2.5 ల‌క్ష‌ల‌కే ఉండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on February 1, 2024 2:29 pm

Share

Recent Posts

చెల్లెలిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

క‌లిసి రాజ‌కీయం చేయ‌క‌పోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య కొన్ని పోలిక‌లు క‌నిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణ‌లో ఈ…

3 hours ago

చెన్నైలో చింటు మేనియా

సోష‌ల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. త‌న సినిమాల ఈవెంట్ల‌లో, ఇంట‌ర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్ర‌ముఖ తెలుగు…

3 hours ago

కనకరాజు లెక్కలు సేఫ్ గానే ఉన్నాయా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…

3 hours ago

బాగుంది ఆదివారం… థియేటర్లలో జన సందోహం

ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…

4 hours ago

కాలేజీలు కాదు… విద్యార్థుల ఖాతాల్లోకే ఫీజు రీయంబర్స్మెంట్ జమ?

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…

4 hours ago

పోలీసు యూనిఫాంలో ఉగ్ర‌వాదులు… ఢిల్లీ నిర‌స‌న‌ల్లో కుట్ర‌?

నీట్ ప్ర‌శ్న‌ప‌త్రం లీకేజీకి వ్య‌తిరేకంగా విద్యార్థులు చేప‌ట్టిన ఢిల్లీ నిర‌స‌న‌లో ఉగ్ర‌వాదుల కుట్ర కోణం బ‌య‌ట ప‌డింద‌ని ఢిల్లీ టాస్క్‌ఫోర్స్…

4 hours ago