Political News

వైసీపీ ఐదో జాబితాలో సంచ‌ల‌న మార్పులు

ఏపీ అధికార పార్టీ వైసీపీ వ‌చ్చే పార్ల‌మెంటు, అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు జాబితాలు ప్ర‌క‌టించింది. వీటిలో కొంద‌రికి స్థానచ‌ల‌నం క‌ల్పించ‌డంతోపాటు.. మ‌రికొంద‌రు కొత్త ముఖాల‌కు..(ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీల్లో) అవ‌కాశం క‌ల్పించారు. ఇప్పుడు తాజాగా ఐదో జాబితాను వైసీపీ ప్ర‌క‌టించింది. ఈ ఐదో జాబితాలో మొత్తం 4 పార్ల‌మెంటు స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌గా.. మూడు అసెంబ్లీ స్థానాల‌కు స‌మ‌న్వ‌య క‌ర్త‌ల‌ను నియ‌మించింది. ఈ జాబితాను మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ విడుద‌ల చేశారు.

1) నర‌స‌రావుపేట ఎంపీ సీటును బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన అనిల్ కుమార్ యాద‌వ్‌కు ఇచ్చారు. ఈయ‌న ప్ర‌స్తుతం నెల్లూరు సిటీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. వ‌రుస విజ‌యాల‌తో ఆయ‌న ఫైర్ బ్రాండ్ నాయ‌కుడిగా కూడా గుర్తింపు పొందారు.

2) కాకినాడ పార్ల‌మెంటు స్థానాన్ని చెల‌మ‌ల శెట్టి సునీల్‌కు ఇచ్చారు. ఈయ‌న కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు. గ‌తంలోనూ.. ప్ర‌స్తుతం ఆయ‌న వివాద‌ర‌హిత నాయ‌కుడిగా సామాజిక వ‌ర్గంలో మంచి గుర్తింపు పొందారు. వ్యాపార వేత్త‌. ఆర్థికంగా బ‌లంగా ఉన్నారు.

3) తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి ప్ర‌స్తుత ఎంపీ. గురుమూర్తినే డిసైడ్ చేశారు. ఈయ‌న వైద్యుడు. 2021లో జ‌రిగిన ఉప ఎన్నిక‌లో పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. వాస్త‌వానికి ఈయ‌న‌ను నాలుగో జాబితాలో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి పంపించారు. కానీ, తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి ఎంపిక చేసిన కోనేటి ఆదిమూలం టీడీపీలో చేరేందుకు ప్ర‌య‌త్నించ‌డంతో గురుమూర్తి ప్లేస్‌ను తిరిగి ఆయ‌నకే ఇచ్చారు. ఈయ‌న కూడా వివాద ర‌హితుడు. విద్యావంతుడు.

4) మ‌చిలీప‌ట్నం పార్ల‌మెంటు స్థానానికి సింహాద్రి ర‌మేష్ బాబును ఎంపిక చేశారు. ఈయ‌న మాజీ ఎమ్మెల్యే. అవ‌నిగ‌డ్డ నుంచి గ‌తంలో కాంగ్రెస్ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్నారు. ఈయ‌న వివాదాల‌కు దూరంగా ఉంటారు.

5) స‌త్య‌వేడు ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా నూక‌తోటి రాజేష్‌కు అవ‌కాశం ఇచ్చారు. ఈయ‌న కొత్త‌వారు.

6) అర‌కు ఎమ్మెల్యేగా రేగం మ‌త్య్స‌లింగంకు అవ‌కాశం క‌ల్పించారు. ఈయ‌న కూడా కొత్త‌వారే. పైగా ఇది ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గం కావ‌డం గ‌మ‌నార్హం.

7) అవ‌నిగ‌డ్డ ఎమ్మెల్యే సీటును సింహాద్రి చంద్ర‌శేఖ‌ర‌రావుకు ఇచ్చారు. మొత్తంగా.. మూడు అసెంబ్లీ, నాలుగు పార్ల‌మెంటు స్థానాల‌కు వైసీపీ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసింది.

This post was last modified on %s = human-readable time difference 10:01 pm

Share
Show comments

Recent Posts

తొమ్మిది సినిమాల జాతర ఉంది కానీ

నవంబర్ నెల తొలి శుక్రవారం బోలెడు సినిమాలు మోసుకొస్తోంది కానీ మూవీ లవర్స్ లో ఏమంత ఆసక్తి కనిపించకపోవడం బాక్సాఫీస్…

10 hours ago

ఆ కారు ప్రమాదంపై స్పందించిన విజయమ్మ

2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండూ ఒకేసారి ఊడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన…

10 hours ago

పవన్ వ్యాఖ్యలపై అనిత ఫస్ట్ రియాక్షన్

ఏపీలో శాంతి భద్రతలపై, హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి…

10 hours ago

ముగ్గురు హీరోలు కలిస్తే రచ్చే

కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే…

10 hours ago

పవన్ వ్యాఖ్యలపై ఫస్ట్ రియాక్షన్ ఆ మంత్రిదే

పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ…

10 hours ago

హనుమంతుడు రిషబ్ అయితే రానా ఎవరు

2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ…

13 hours ago