కాంగ్రెస్ ఏపీసీసీ చీఫ్ వైఎస్. షర్మిల రాష్ట్రంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. నియోజకవర్గాలు.. జిల్లాల్లో ఆమె పర్యటిస్తూ.. పార్టీ కార్యకర్తలతోనూ భేటీ అవుతోంది. అయితే.. ఆమె తన పర్యటనల్లో ప్రధానంగా వైసీపీ పాలనను, తన అన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను భారీ ఎత్తున టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కరడుగట్టిన ప్రతిపక్ష నాయకులు కూడా చేయని విమర్శలు, వ్యక్తిగత సవాళ్లు, కుటుంబ వ్యవహారాలు ఇలా.. ఒకటి కాదు.. రెండు కాదు.. బోలెడన్ని విమర్శలు డంప్ చేసేస్తున్నారు. దీంతో షర్మిల వ్యవహారం.. రోజు రోజుకు హాట్‌టాపిక్‌గా మారుతోంది. జగన్‌ను వ్యతిరేకించే వర్గాలకు షర్మిల ఇప్పుడు తురుపు ముక్కగా మారిపోయారు.
ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఆమె భద్రతకు సంబంధించిన వ్యవహారం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆమె కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌గా అడుగు పెట్టిన సందర్భంలో ప్రభుత్వం ఆమెకు 4+4(ఉదయం నలుగురు, సాయంత్రం నలుగురు) భద్రత కల్పించింది. అయితే.. ఆమె వ్యవహారం.. దూకుడుగా ఉండడంతో ప్రభుత్వాన్ని నేరుగా టార్గెట్ చేస్తుండడంతో అనూహ్యంగా ఈ భద్రతను 2+2కు తగ్గించారు. తాజాగా మంగళవారం నుంచి దీనిని కూడా తీసేసి 1+1 భద్రతకే పరిమితం అయ్యారు. ఈ నిర్ణయంపై కాంగ్రెస్, టీడీపీ సహా ఇతర పార్టీల్లోని నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు కామనేనని.. భద్రతను తొలగించడం దారుణమని అంటున్నారు.
ఇక, తన భద్రతను 2+2కు తగ్గించినప్పుడే షర్మిల.. డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. ఇలా ఎందుకు చేశారో చెప్పాలని నిలదీశారు. దీనికి సమాధానం వచ్చేలోగానే భద్రతను 1+1కు మార్చారు. ఇప్పుడు ఇది మరింత కలకలం రేపుతోంది. తాజాగా దీనిపై స్పందించిన మాజీ పీసీసీచీఫ్ రఘువీరా రెడ్డి ప్రభుత్వం ఇలా చేయడం సరికాదంటూ.. ఎక్స్ వేదికగా స్పందించారు.
“ఏపీసీసీ చీఫ్ షర్మిల 4+4 సెక్యూరిటీ కలిగి ఉండేవారు. ప్రజాక్షేత్రంలో చురుకుగా ఉన్న తరుణంలో 2+2 కు తగ్గించారు. ఇప్పుడు మరలా 1+1కు తగ్గించారు. కార్యకర్తల సమావేశాల నిమ్మిత్తం ఆమె రాష్ట్రముంతా తిరిగినప్పుడు.. ఎన్నికల తరుణంలో, ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడం నేను గమనించాను. కాబట్టి అత్యవసరంగా, తక్షణం షర్మిల కోరిన విధంగా 4+4 సెక్యూరిటీ… ఎస్కార్ట్ వాహన సౌకర్యం కల్పించగలరు” అని ఏపీ డీజీపీకి ఎక్స్ వేదికగా రఘువీరా అభ్యర్తన పంపించారు. మరి ఎలాంటి నిర్ణయం వస్తుందో చూడాలి.
This post was last modified on January 31, 2024 9:59 pm
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…