Political News

అన్నా ఈ సారి త‌ప్పుకోండి.. :జ‌గ‌న్‌

క‌ర‌ణం బ‌ల‌రాం ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాల్లో 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అని చెప్పుకుంటూ రాజ‌కీయాలు చేసే నేత‌. గ‌త 15 ఏళ్లుగా క‌ర‌ణం రాజ‌కీయంగా ప‌ట్టుదొర‌క్క నానా తిప్ప‌లు ప‌డుతున్నారు. తాను త‌ప్పుకుని త‌న కొడుకుని గ్రాండ్‌గా పొలిటిక‌ల్ ఎంట్రీ చేయిద్దామ‌ని.. కొడుకుతో అసెంబ్లీలో అధ్య‌క్షా అని పలికిద్దామ‌ని బ‌ల‌రాం క‌న్న క‌ల‌లు కూడా క‌ల‌లుగానే మిగిలిపోయాయి. ఇప్పుడు రాజ‌కీయంగా వేసిన త‌ప్ప‌ట‌డుగులతో ఏం చేయాలో తెలియ‌క డైల‌మాలో ప‌డిపోయిన ప‌రిస్థితి.

2014లోనే క‌ర‌ణం త‌న కుమారుడు వెంక‌టేష్‌కు టీడీపీ నుంచి అద్దంకి సీటు ఇప్పించుకున్నారు. 2009, 14 ఎన్నిక‌ల్లో క‌ర‌ణం తండ్రి, కొడుకుల‌ను ఓడించిన గొట్టిపాటి ర‌వికుమార్ టీడీపీ కండువా క‌ప్పుకోవ‌డంతో అద్దంకిలో క‌ర‌ణం ఫ్యామిలీకి జోరుకు బ్రేకులు ప‌డిపోయాయి. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు రాజీతో చీరాల నుంచి పోటీ చేసిన క‌ర‌ణం అక్క‌డ ప‌రిస్థితుల నేప‌థ్యంలో గెలిచారు. త‌ర్వాత యేడాదిన్న‌ర‌కే వైసీపీ చెంత చేరిపోయారు.

ప్ర‌స్తుతం చీరాల ఇన్‌చార్జ్‌గా క‌ర‌ణం త‌న‌యుడు వెంక‌టేష్ ఉన్నారు. అద్దంకిలో వ‌రుస‌గా తండ్రి, కొడుకులు ఓడిపోవ‌డం.. అక్క‌డ గొట్టిపాటి ర‌విపై పోటీచేస్తే గెల‌వ‌లేం అన్న డౌట్‌తో చీరాల‌ను ప‌ట్టుకుని వేలాడుతూ వ‌చ్చారు. పేరుకు వైసీపీ చెంత‌చేరినా కూడా ఈ తండ్రి, కొడుకులు ఏనాడు టీడీపీ, చంద్ర‌బాబు, లోకేష్‌పై ఎప్పుడూ విమ‌ర్శ‌లు చేయ‌లేదు స‌రిక‌దా.. టీడీపీ వాళ్ల‌తో ట‌చ్‌లో ఉంటూ వ‌చ్చారు. ఇప్పుడు వైసీపీలో క‌ర‌ణం ఫ్యామిలీ సీన్ రివ‌ర్స్ అవుతోంది. బాలినేని అండ‌తో ఇప్ప‌టి వ‌ర‌కు గ‌ట్టెక్కుతూ వ‌చ్చిన క‌ర‌ణం ఫ్యామిలీని ఇప్పుడు జ‌గ‌న్ దేకే ప‌రిస్థితి లేదు.

అస‌లు వైసీపీలో బాలినేని మాటే చెల్లుబాటు కావ‌డం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు చీరాల నుంచే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నుకున్న క‌ర‌ణం తండ్రి, కొడుకుల‌కు ఈ సారి టిక్కెట్ ద‌క్కే ప‌రిస్థితి లేదు. సామాజిక స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో జ‌గ‌న్ ఎప్పుడో క‌ర‌ణం కుటుంబాన్ని అద్దంకి లేదా ప‌రుచూరు వెళ్లాల‌ని చెప్పినా విన‌కుండా చీరాలే కావాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. చీరాల సీటు చివ‌రి క్ష‌ణంలో అయినా అయితే మాజీ ఎమ్మెల్యే ఆమంచికి లేదా బీసీల‌కు ఇచ్చే ఆలోచ‌న‌లోనే జ‌గ‌న్ ఉన్నారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు.

ఇప్పుడు అద్దంకిలో హ‌నిమిరెడ్డి రూపంలో దారులు మూసుకుపోయాయి. ఇటీవ‌ల జ‌గ‌న్ బాప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గ ప‌ర్య‌ట‌న‌కు వచ్చిన‌ప్పుడు కూడా అన్నా ఈ సారికి మీరు ఆగాల‌ని చెప్పిన‌ట్టు టాక్ ? అందుకే క‌ర‌ణం తండ్రి, కొడుకులు నియోజ‌క‌వ‌ర్గంలో పూర్తిగా సైలెంట్ అయ్యార‌ని ఆ పార్టీ వాళ్లే గుస‌గుస‌లాడుకుంటున్నారు. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు కాలుగాయంతో నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా ఉన్న క‌ర‌ణం వెంక‌టేష్ ఇప్పుడిప్పుడే కాస్త యాక్టివ్ అవుతున్నా.. టిక్కెట్‌పై న‌మ్మ‌కం లేద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చేసిన‌ట్టు స‌మాచారం.

టిక్కెట్ లేద‌న్న విష‌యం ఇప్పుడే బ‌య‌ట‌కు వ‌చ్చినా, నియోజ‌క‌వ‌ర్గంలో యాక్టివ్‌గా లేక‌పోయినా ఎన్నిక‌ల‌కు ముందు త‌మ కేడ‌ర్ అంతా జారిపోతుందన్న ఆందోళ‌న‌తోనే క‌ర‌ణం తండ్రి, కొడుకులు మేక‌పోతు గాంభీర్యంతోనే రాజ‌కీయం చేస్తున్న‌ట్టుగా కూడా జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది. ఒక‌వేళ అటు టీడీపీ వైపు చూసినా అక్క‌డ కూడా కుర్చీలు ఖాళీగా లేవు. ఏదేమైనా ఏదేనా అద్భుతం జ‌రిగితే త‌ప్పా ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాల్లో క‌ర‌ణం శకం ముగిసే వాతావ‌ర‌ణ‌మే క‌నిపిస్తోంది.

This post was last modified on January 30, 2024 10:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈ సంక్రాంతికైనా జనంలోకి జగన్ వస్తారా?

రాష్ట్ర రాజ‌కీయాల్లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే దిశ‌గా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. స‌హ‌జంగా అధికారంలో ఉన్న‌పార్టీలు…

2 hours ago

‘పార్టీ మారినోళ్లు రెండూ కానోల్లా?’

తెలంగాణ‌లో తాజాగా జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకుంద‌ని.. ఇది 2029 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని.. అప్పుడు…

4 hours ago

కూటమి కట్టక తప్పదేమో జగన్

వ్య‌క్తిగ‌త విష‌యాలే..  జ‌గ‌న్‌కు మైన‌స్ అవుతున్నాయా? ఆయ‌న ఆలోచ‌నా ధోర‌ణి మార‌క‌పోతే ఇబ్బందులు త‌ప్ప‌వా? అంటే.. అవున‌నే సంకేతాలు పార్టీ…

6 hours ago

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

9 hours ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

10 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

12 hours ago