Political News

కార్యాల‌యాల్లో ఎమ్మెల్యే కొడుకు ఫొటో

వైసీపీ ఎమ్మెల్యే.. ఫైర్‌బ్రాండ్ నాయ‌కుడు చంద్ర‌గిరి శాస‌న స‌భ్యుడు చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డికి స్థానికుల నుంచి సెగ తగిలింది. నిజానికి ఆయ‌నంటే.. నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద‌గా వ్య‌తిరేక‌త లేదు. అంద‌రిలోనూ క‌లివిడిగా ఉంటారు. ఆర్భాటాలు, అట్ట‌హాసాల‌కు పెద్ద‌గా ప్రాధాన్యం ఇవ్వ‌కుండా క‌లిసిపోతారు. క‌ష్టాలు, సుఖాల్లో నేనున్నానంటూ.. ముందుకు వ‌స్తారు. దీంతో చెవిరెడ్డి సామాన్యుల్లో ఫాలోయింగ్ ఉంది. అయితే.. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో కొన్ని కొన్ని ప‌నులు పెద్ద సెగ‌నే పెడుతున్నాయి. ప్ర‌స్తుతం చంద్ర‌గిరి టికెట్‌ను సీఎం జ‌గ‌న్ చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి ఇచ్చారు.

ఆయ‌న ఇంకా ప్ర‌చారంలోకి దిగ‌లేదు. పైగా నోటిఫికేష‌నే రాలేదు. అయితే.. ప్ర‌జ‌ల‌ను మాత్రం క‌లుస్తున్నారు. ఇది త‌ప్పు కాదు. అయితే.. షాడో ఎమ్మెల్యేగా వ్య‌వ‌హ‌రిస్తూ.. అధికారుల‌పై పెత్త‌నం చేయ‌డం.. కీల‌క‌మైన కార్యాల‌యాల్లో సీఎం జ‌గ‌న్ ఫొటో ప‌క్కన మోహిత్ రెడ్డి ఫొటోను పెట్ట‌డం.. అధికారులు కూడా ఆయ‌న మాట‌ల‌కే ప్రాధాన్యం ఇవ్వ‌డం వంటివి వివాదంగా మారుతున్నాయి. గ‌త రెండేళ్ల నుంచి కూడా మోహిత్‌కే టికెట్ అని చెవిరెడ్డి ప్రచారం చేస్తున్నారు. తాను త‌ప్పుకొంటాన‌ని చెబుతున్నారు. దీంతో మోహిత్ రెడ్డి దూకుడు స‌హ‌జంగానే పెరిగింది. కానీ, ఇంత‌గా ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో.. ఆయ‌న ఫొటోలు పెట్టే రేంజ్‌లో పెరుగుతుంద‌ని స్థానికులు ఊహించ‌లేదు.

ఈ నేప‌థ్యంలో తాజాగా కొంద‌రు మ‌హిళ‌లు, స్థానికుల‌తో క‌లిసి.. స‌ద‌రు ప్ర‌భుత్వ కార్యాల‌యం వ‌ద్ద ధ‌ర్నా నిర్వ‌హించారు. ఏ అధికారం ఉంద‌ని మోహిత్ రెడ్డి ఫొటో ఆఫీసులో పెట్టార‌ని వారు ప్ర‌శ్నించారు. ప్ర‌తి విష‌యానికీ ఆయ‌న‌ను క‌ల‌వాల‌ని చెప్ప‌డం ఏంట‌ని నిల‌దీశారు. దీనిపై స‌మాధానం ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. దీంతో స‌ద‌రు మ‌హిళ‌ల‌కు స‌ర్ది చెప్పేందుకు అధికారులు ప్ర‌య‌త్నించారు. కానీ, వారు శాంతించ‌క పోవ‌డంతో ఎమ్మెల్యే కార్యాల‌యం వ‌ర‌కు స‌మాచారం చేసింది. త‌ర్వాత ఏం జ‌ర‌గిందో తెలియ‌దు కానీ.. వ‌చ్చిన వారు వ‌చ్చిన‌ట్టు వెళ్లిపోయారు. కానీ, ప్ర‌తిప‌క్షాలు మాత్రం దీనినితీవ్రంగా త‌ప్పుబ‌డుతున్నాయి. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అప్పుడే ఎమ్మెల్యే అయిపోయాడా? అంటూ స‌టైర్లు వేస్తున్నారు.

This post was last modified on January 30, 2024 9:54 pm

Share

Recent Posts

ఇది మన ఇరుముడి – చదుకోవాల్సిన కేస్ స్టడీ

ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…

10 minutes ago

స్థానిక ఎన్నిక‌ల్లో… జ‌న‌సేన త్రిముఖ వ్యూహం..!

స్థానిక ఎన్నికల‌పై జ‌న‌సేన త్రిముఖ వ్యూహాన్ని అనుస‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..…

3 hours ago

విద్యార్థుల పాలిట శాపంగా మారిన గోడలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…

4 hours ago

నిర్మాత గాయాలకు ‘టాక్సిక్’ మందు అవుతుందా

నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…

12 hours ago

కాకా… నిజంగా అలా తీస్తే

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…

12 hours ago

50 భాషల్లో వారణాసి… డబ్బింగ్ కోసం 1500 ఆర్టిస్టులు

కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…

12 hours ago