ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా చక్రం తిప్పుతున్న వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల దూకుడుగా ఉన్న విషయం తెలిసిందే. గత పదేళ్లు నిద్రాణంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని పరుగులు పెట్టిస్తానంటూ.. ఆమె చెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమెజిల్లాలు, నియోజకవర్గాల యాత్రను ప్రారంభిం చారు. ఇక, పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేణులతో ఆమె నియోజవర్గాల వారిగా.. జిల్లాల వారిగా చర్చలు జరుపుతున్నారు. వైసీపీసర్కారు సహా సొంత అన్నపై ఆమె విమర్శలు గుప్పిస్తున్నారు.
తీవ్రస్థాయిలో షర్మిల.. సంధిస్తున్న విమర్శలు రాజకీయాల్లో చర్చగా మారుతున్నాయి. ఇప్పటి వరకు ఇంత దూకుడుగా.. ఇంత షార్ప్‌గా విమర్శలు సంధించలేదని అంటున్నారు. మొత్తంగా షర్మిల దూకుడు పెరిగింది అయితే.. ఆమెకు అండగా ఇప్పటి వరకు కాంగ్రెస్ తరఫున గళం వినిపించేందుకు బలంగా ఎవరూ ముందుకు రాలేదు. మాజీ మంత్రి పనబాక లక్ష్మి వంటి కొందరు కీలక నాయకులు ఉన్నప్పటికీ. వారు వేరే పార్టీల్లో ఉన్నారు. దీంతో మహిళా నాయకురాలిగా షర్మిల ఒంటరిపోరు చేస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా తెలంగాణకు చెందిన మంత్రి, వైఎస్ కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన కొండా సురేఖ.. జతకలవనున్నారు. షర్మిలకు తాను అండగా ఉంటానని.. కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తానని సురేఖ వెల్లడించారు. త్వరలోనే తాను ఏపీకి వెళ్తానని.. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందని ఆమె చెప్పారు. ఈ సందర్భంగా ఆమె వైఎస్‌తో తనకు ఉన్న అనుబంధం.. రాజకీయంగా ఆయన ఆశీర్వాదంతోనే ఇలా ఉన్నతస్తాయిలో ఉన్నానని చెప్పారు.
ఇదిలావుంటే.. సీఎం జగన్‌కు మరింత సెగ పెరగనుందని పరిశీలకులు చెబుతున్నారు. వైసీపీ కోసం ఉమ్మడి రాష్ట్రంలో స్పందించిన తొలి మహిళా నాయకురాలు.. కొండా సురేఖ. అంతేకాదు.. అప్పట్లో రోశయ్య గవర్నమెంటులో ఆమె మంత్రి. అయితే.. జగన్ పార్టీ కోసం ఆమె ఆ పదవికి రాజీనామా చేసి వచ్చారు. తర్వాత.. వైసీపీలో అవమానాలు ఎదురయ్యాయని పేర్కొంటూ ఆమె భర్త మురళీ.. సురేఖలు బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో గతాన్నితవ్వి.. జగన్‌పై దాడి చేసే అవకాశం ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
This post was last modified on January 30, 2024 10:13 pm
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…
అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…
టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…
విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…
మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…