తెలంగాణా నుండి రాజ్యసభ ఎంపీగా సోనియాగాంధిని ఎన్నుకోవాలని తెలంగాణా కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తోందట. మొదట్లో సోనియాను తెలంగాణాలోని ఏదైనా పార్లమెంటు నియోజకవర్గంలో పోటీచేయించాలని అనుకున్నారు. మెదక్, ఖమ్మం పార్లమెంటు స్ధానాల్లో ఎందులో అయినా పోటీచేయాలని సోనియాకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి రిక్వెస్టుచేసింది. పీసీసీ సమావేశంలో చేసిన తీర్మానాన్ని కూడా ఐఏసీసీకి పంపింది. నేరుగా ఢిల్లీకి వెళ్ళినపుడు రేవంత్ రెడ్డి అండ్ కో కూడా ప్రస్తావించారు. దానిపై సోనియా ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలీలేదు.
అయితే పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ప్రత్యక్షరాజకీయాల నుండి సోనియా రిటైర్ అయిపోవాలని డిసైడ్ అయ్యారట. ప్రస్తుతం అమేథి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియా రాబోయే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని అనుకున్నారట. అందుకనే వచ్చేఎన్నికల్లో అమేథి నుండి రాహుల్ లేదా ప్రియాంక పోటీచేసే అవకాశం ఉందనే టాక్ వినబడుతోంది. అందుకనే తెలంగాణా నుండి పోటీచేయమని వచ్చిన రిక్వెస్టుపై సోనియా ఏమి చెప్పలేదట. అయితే ఇపుడు సడెన్ గా వచ్చిన రాజ్యసభ ఎన్నికల నోటిపికేషన్ తో పీసీసీ ఆలోచన మారిందంటున్నారు.
లోక్ సభలో పోటీచేయటమంటే సోనియా దూరంగా ఉండే అవకాశముంది. కానీ రాజ్యసభ ఎన్నికలంటే సోనియా పడే కష్టమేమీ ఉండదు. ఎందుకంటే అసెంబ్లీలో బలాలను బట్టి రెండుస్ధానాలు కాంగ్రెస్ కు ఒక్కస్ధానం బీఆర్ఎస్ కు వస్తుంది. మూడు స్ధానాల భర్తీలో ఒక్క ఎంపీకి 30 మంది ఎంఎల్ఏలు ఓట్లేయాల్సుంటుంది. కాంగ్రెస్ కు ఉన్న 64 ఓట్లతో రెండుస్ధానాలను ఈజీగా గెలుస్తుంది. కాబట్టి రెండింటిలో ఒకదానిలో సోనియాతో నామినేషన్ వేయించాలన్నది కాంగ్రెస్ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ కో ఆలోచనగా తెలుస్తోంది.
78 ఏళ్ళ వయసులో ఉన్న సోనియా చాలాకాలంగా క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్నారు. కరోనా కూడా రెండుసార్లు ఎటాక్ అయ్యింది. కాబట్టే ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. లోక్ సభకు పోటీచేయటం కన్నా రాజ్యసభ ఎంపీగా వెళ్ళటం హ్యాపీ అనుకుంటే సోనియా గ్రీన్ సిగ్నల్ ఇస్తారనే అనుకుంటున్నారు. మరి మిగిలిన రెండోస్ధానంలో ఎవరిని ఎంపికచేస్తారో చూడాలి.
This post was last modified on January 30, 2024 10:18 am
విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు మరో కీలక మలుపు తీసుకుంది. గోపాలపురం ఎయిర్పోర్టు…
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఇప్పుడు నిజంగానే ఫుల్ రిలీఫ్ దొరికిందని చెప్పాలి. తన తాజా చిత్రం…
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్యాగ్ ని సంవత్సరాల తరబడి మోస్తున్న ప్రభాస్ పెళ్లి శుభవార్తని వినాలనే కొద్దీ ఆలస్యమవుతూనే…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతగా ఓ రేంజిలో ఎలివేషన్లు దక్కించుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా నిజంగానే పండుగ పూట…
గత డిసెంబర్ లో సర్వం సిద్ధం చేసుకుని పూజా కార్యక్రమాలతో సినిమా మొదలవుతుందని అందరూ ఎదురు చూస్తున్న టైంలో మోక్షజ్ఞ…
నిన్న విడుదలైన గేమ్ ఛేంజర్ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోనప్పటికీ మిక్స్డ్ టాక్ తోనూ క్రమంగా పుంజుకుంటుందనే నమ్మకంలో…