సారి సంచలన మార్పులు చోటు చేసుకుంటాయనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలను గమనిస్తే.. కీలకమైన ఇద్దరు నాయకులు.. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమని మాస్ టాక్. వీరు ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీలో అడుగు పెడతారని అంటున్నారు. వారే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. “వారిద్దరూ ఈ సారి పక్కాగా సభలో అడుగు పెడతారు. వారిద్దరు ఉంటే.. సభ ఎలా ఉంటుందో“ అని పొలిటికల్ సర్కిళ్ల మధ్య కూడా చర్చ సాగుతోంది.
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీగెలుస్తుంది? ఏ పార్టీ ఓడుతుంది? అనే విషయాన్ని పక్కన పెడితే.. కీలకమైన నాయకుల గురించి మాత్రం తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది. వైసీపీ సర్కారు సహా సీఎం జగన్‌ను టార్గెట్ చేసుకుని.. పవన్ కళ్యాణ్ ఆది నుంచి దూకుడుగా ఉన్నారు. గత ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటి చేసినా.. పరాజయం పాలయ్యారు. కానీ, రాష్ట్రం కోసం.. రాష్ట్ర సమస్యల కోసం ఆయన గళం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటిబలమైన నాయకుడు సభలో ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దీంతో పవన్ ఎక్కడ నుంచి పోటీ చేసినా ఈ దఫా గెలిచి తీరుతారని పార్టీలకు అతీతంగా అభిమానులు చెబుతున్నారు. పవన్ వాయిస్ సభలో అయితే.. ఇంకా బాగుటుందని అనే వారు పెరుగుతున్నారు. దీంతో పవన్ గెలుపు తథ్యమనే టాక్ వినిపిస్తోంది. ఇక, వైఎస్ తనయగా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన వైఎస్ షర్మిల కూడా.. బలమైన గళం వినిపిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ లోపాలు.. ప్రజా సమస్యలను ఆమె ప్రస్తావిస్తున్నారు. ఇవి పార్టీకి ఎంత వరకు కలిసి వస్తాయో తెలియదు. కానీ, ఆమెకు ప్లస్ అవుతాయని అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి కనుక ఆమె పోటీ చేస్తే.. గెలిచే చాన్స్ నూటికి 100 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా ఆమె గళం అసెంబ్లీకి చేరితే.. ప్రజాసమస్యలపై మరింత ప్రస్తావన పెరుగుతుందని మేధావులు కూడా అంచనా వేస్తున్నారు. ఇలాంటివారిని అసెంబ్లీకి పంపిస్తే.. బాగుంటుందని అంటున్నారు. ఇక, ఇప్పటికే చంద్రబాబు గెలుపును రాసిపెట్టుకున్న దరిమిలా.. ఇప్పుడు ఈ ఇద్దరి విషయంలోనూ పాజిటివ్ ఆలోచనలు రావడం గమనార్హం. ఇదే జరిగితే.. రాష్ట్ర చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైనట్టేనని అంటున్నారు.
This post was last modified on January 30, 2024 6:34 pm
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…