Political News

మా పొత్తును విచ్ఛిన్నం చేయ‌లేరు: చంద్ర‌బాబు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు రా.. క‌ద‌లిరా! పేరుతో నిర్వ‌హిస్తున్న బ‌హిరంగ స‌భ .. తాజాగా రాజ‌మండ్రిలో జ‌రిగింది. గ‌త వారం నుంచి ఆయ‌న ఉద‌యం, సాయంత్రం వేళల్లో రా..క‌ద‌లిరా! బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హి స్తున్నారు. తాజాగా.. రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన స‌భ‌లో మాట్లాడుతూ.. త‌మ పొత్తును విచ్చిన్నం చేయాల ని చూస్తున్నార‌ని, కానీ.. వారి ప‌ప్పులు త‌న ద‌గ్గ‌ర ఉడ‌క‌వ‌ని చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌-టీడీపీ గెలిచి తీరుతాయ‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

పొత్తు పెట్టుకున్న‌ది.. త‌మ రెండు పార్టీల కోసం కాద‌ని.. న‌వ్యాంధ్ర భ‌విష్య‌త్తు కోస‌మ‌ని చంద్ర‌బాబు చెప్పా రు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తును ఆశీర్వ‌దించేందుకు ఐదు కోట్ల మంది ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నార‌ని తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోడానికి ‘రా కదిలి రా’ అని పిలుపు ఇచ్చిన‌ట్టు చంద్ర‌బాబు చెప్పారు. మహానాడును తలపించే విధంగా సభకు ప్రజలు తరలి వచ్చారంటూ.. ఆయ‌న వ్యాఖ్యానించారు. అయితే.. ఇదే స్ఫూర్తిని ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ చూపించాల‌ని బాబు పిలుపునిచ్చారు.

రాష్ట్రానికి త్వ‌ర‌లోనే మంచి రోజులు రానున్నాయ‌ని తెలిపారు. టీడీపీ, జనసేన ఉమ్మ‌డి గెలుపును ఎవరూ ఆపలేరని చెప్పారు. “రా కదలిరా పిలుపు టీడీపీ, జనసేన కోసం కాదు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం. భవిష్యత్తు ను కాపాడుకోవ‌డం కోస‌మే” అని చంద్ర‌బాబు అన్నారు. రాష్ట్రంలో మానసిక రోగి పరిపాల‌న సాగిస్తున్నాడ‌ని చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆయ‌న నుంచి ప్ర‌జ‌ల‌ను కాపాడుకోవాల్సిన అవ‌స‌రం త‌మ‌పై ఉంద‌న్నారు. అందుకే.. జ‌న‌సేన‌-టీడీపీ పొత్తు పెట్టుకున్నామ‌న్నారు.

వ‌చ్చే ఐదేళ్ల‌లో రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో ముందుకు న‌డిపిస్తాన‌ని చంద్ర‌బాబు చెప్పారు. రాష్ట్రానికి ఒక్క పెట్టుబ‌డి కూడా ఈ ఐడేళ్ల‌లో రాలేద‌ని.. తాను అధికారంలోకి వ‌చ్చాక‌.. పెట్టుబ‌డులు ఎలా ప‌రుగులు పెడతాయో చూడాల‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. “అప్పుడు ముద్దులు పెట్టాడు.. ఇప్పుడు మాయ మాటలు చెబుతున్నాడు. వీటిని న‌మ్మితే త‌మ్ముళ్లూ.. మ‌రోసారి రాష్ట్రం నాశ‌నం కావాల్సిందే” అని సీఎం జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.కానీ, తూర్పులో నిర్వ‌హించిన ఈ స‌మావేశానికి భారీ ఎత్తున ప్ర‌జ‌లు, పార్టీ అభిమానులు త‌ర‌లి వ‌చ్చారు.

This post was last modified on January 29, 2024 6:52 pm

Share

Recent Posts

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

17 minutes ago

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

1 hour ago

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

5 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

5 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

6 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

13 hours ago