Political News

కేసీఆర్ తెచ్చే కొత్త రెవెన్యూ చట్టంలో ఉండే అంశాలు ఇవేనా?

దశాబ్దాలుగా సాగే విధానాల్ని మార్చేయటం అంత సులువు కాదు. అలవాటైన పాలనా వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే పాలకులకు ఎంతో దమ్ము.. ధైర్యం చాలా అవసరం . ఈ విషయంలో తనలో టన్నుల కొద్ది ఉందన్నట్లుగా వ్యవహరించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. గడిచిన కొన్ని నెలలుగా రెవెన్యూ చట్టాన్ని సరికొత్తగా తీసుకురావాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా కేసీఆర్ అనుకున్నది అనుకున్నట్లుగా సాగలేదు.

ఇప్పట్లో కరోనాను కంట్రోల్ చేయటం సాధ్యం కాదన్న విషయంపై క్లారిటీ వచ్చిన తర్వాత.. పాలనా సంస్కరణల మీద మరింత జోరు పెంచారు కేసీఆర్.
అన్ని అనుకున్నట్లుగా జరిగితే..ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని తెర మీదకు తీసుకురావటం ఖాయమంటున్నారు.

ప్రభుత్వంలో జరిగే అవినీతి సింహ భాగం రెవెన్యూ విభాగంలోనే అన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. తాను ఏం చెబుతున్నానో.. అవన్నీ పచ్చి వాస్తవాలన్న మాట చెప్పేందుకు వీలుగా.. ఇటీవల కాలంలో పట్టుబడిన రెవెన్యూ శాఖకు చెందిన పలువురు అవినీతి అధికారుల ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కొత్త రెవెన్యూ చట్టాన్ని తనదైన రీతిలో సరిదిద్దుతున్నారు కేసీఆర్. ఇప్పటికున్న వివిధ స్థాయిల్ని మార్చటంతో పాటు.. పలువురు అధికారుల అధికారాలకు కత్తెర వేయటం.. రద్దు చేయటం లాంటివి ఉంటాయని చెబుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం తేనున్న కొత్త రెవెన్యూ చట్టంలో ఉండే అంశాలు ఏమన్న విషయంలోకి వెళితే.. పలు అంశాల్ని ప్రస్తావిస్తున్నారు. అవేమిటో చూస్తే..

  • రెవెన్యూ శాఖలో అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉండే గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థను రద్దు చేయటం. వీఆర్వోలను ఇతర శాఖల్లో కలిపివేయటం.
  • అదే సమయంలో గ్రామ రెవెన్యూ సహాయకులను మాత్రం కంటిన్యూ చేయాలి.
  • ప్రతి తహసీల్దార్ ఆఫీసులో ప్రస్తుతం ఉండే ఇద్దరు రెవెన్యూ ఇన్ స్పెక్టర్ల సంఖ్యను నాలుగుకు పెంచటం
  • రైతులకు.. భూముల యజమానులకు మరింత వేగంగా సేవలు అందించటానికి వీలుగా రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ ను సులభతరం చేయటం
  • నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్ మెంట్ ను మరింత కఠినతరం చేయటం
  • గ్రామాల్లో వ్యవసాయ భూములను విచ్చల విడిగా వ్యవసాయేతర భూములుగా మార్చకుండా కఠినంగా వ్యవహరించటం
  • వివాదాలు లేని వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే.. రికార్డుల్లో మ్యుటేషన్ వేగంగా జరిగేలా చేయటం
  • కొత్త చట్టంలో తహసీల్దార్ల పాత్రను పరిమితం చేయటం.. ఆర్డీవోల అధికారాల్ని బలోపేతం చేయటం

This post was last modified on September 7, 2020 11:05 am

Share
Show comments
Published by
satya

Recent Posts

తారక్ బంధం గురించి రాజమౌళి మాట

దర్శకధీర రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బంధం ఉందో చాలాసార్లు బయటపడిందే అయినా ప్రతిసారి కొత్తగా…

5 mins ago

తులం బంగారం రూ.2 లక్షలు!

సరిగ్గా మూడేండ్ల క్రితం రూ.40 వేలు తులం ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.70 వేల మార్క్ ను దాటిపోయింది.…

9 mins ago

టీడీపీ – జనసేన కూటమి మేనిఫెస్టోపై వైసీపీ భయాలివే.!

టీడీపీ - జనసేన - బీజేపీ కలిసి కూటమి కట్టాక, కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబు ఫొటోతోపాటు పవన్ కళ్యాణ్ ఫొటో…

1 hour ago

OG అభిమానుల్లో అయోమయం

ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆలోచించడం లేదు కానీ అభిమానులు మాత్రం ఈ…

2 hours ago

జగన్ పై షర్మిల మోస్ట్ డామేజింగ్ కామెంట్

క‌డ‌ప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న‌ను క‌డ‌ప…

3 hours ago

దొరలను దోచుకునే ‘వీరమల్లు’ ఆగమనం

పవర్  స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…

3 hours ago