వైసీపీ అధినేత జగన్ వ్యూహానికి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతివ్యూహం రెడీ చేశారా? అదిరిపోయే స్కెచ్‌తో ఆయన ముందుకు రానున్నారా? అంటే.. అవుననే అంటున్నాయి టీడీపీ వర్గాలు. ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్.. వచ్చే ఎన్నికలను పూర్తిగా బీసీ మంత్రంతో జరిపించాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో బీసీల ఓటు బ్యాంకు 52 శాతం ఉండడం, వారిలోనూ మహిళా పర్సంటేజ్ ఎక్కువగా ఉన్న దరిమిలా.. మెజారిటీ స్థానలను బీసీలకే కేటాయించాలని జగన్ నిర్నయించారు.
ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అనంతపురం ఎంపీ టికెట్(ప్రస్తుత ఎంపీ బీసీనే) నుంచి నరసరావుపేట ఎంపీ టికెట్ వరకు.. అదేవిధంగా మెజారిటీ ఎమ్మెల్యేల స్థానాలను కూడా.. బీసీ అభ్యర్థులకే కేటాయించేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు నియోజకవర్గాలకు సమన్వయ కర్తలను కూడా నియమించారు. తద్వారా.. బీసీ ఓట్లను తనవైపు తిప్పుకొనేందుకు జగన్ వ్యూహత్మంగా ముందుకు సాగుతున్నారు. ఇది టీడీపీ ఓటు బ్యాంకును కూడా కదలించే పరిస్థితి ఉంటుందని అంచనా వచ్చింది.
దీంతో అలెర్ట్ అయిన చంద్రబాబు.. ఈ పరిస్థితిని సమర్ధవంతంగా ఢీ కొట్టేందుకు టీడీపీ తరఫున కూడా బీసీలకు మెజారిటీ టికెట్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఒకటి రెండు చోట్ల తప్ప.. మిగిలిన స్థానాల్లో వైసీపీ ఎత్తుగడలను ఎదుర్కొనే లా బీసీలకే టికెట్లు ఇచ్చేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో అనంతపురం ఎంపీ సీటు సహా.. పలు కీలక స్థానాలలో బీసీలకు చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారు. అదేసమయంలో ఎమ్మెల్యే స్థానాల్లో భారీ మార్పుల దిశగానే అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.
పార్టీపరంగా చూసుకుంటే.. టీడీపీకి పాతకాపులు ఎక్కువగానే ఉన్నారు. వారిలోనూ అగ్రవర్ణాలకు చెందిన వారు ఉన్నారు. వీరంతా వచ్చే ఎన్నికలపై చాలానే ఆశలు పెట్టుకున్నారు. అయితే.. వీరిలో తప్పదు అనుకున్నవారికి తప్ప.. మిగిలిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చేందుకు చంద్రబాబు రెడీ అయ్యారని .. మిగిలిన స్తానాలను మాత్రం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు. అదేవిధంగా పాత నేతల స్థానంలోనూ కొత్త వారికి ఛాన్స్ ఇవ్వడం ద్వారా వైసీపీ చేస్తున్న ప్రయోగాలకు చెక్ పెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. మొత్తంగా జగన్ వ్యూహానికి ప్రతివ్యూహం వేసే పనిలో చంద్రబాబు ఉన్నారని తెలుస్తోంది.
This post was last modified on January 28, 2024 10:00 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…