Political News

పట్టుబట్టి టికెట్ సాధించుకున్నారా ?

రాబోయే ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గంలో టికెట్ ను జేసీ బ్రదర్స్ పట్టుబట్టి సాధించుకున్నారు.  మాజీ ఎంఎల్ఏ, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి కొడుకు అస్మిత్ రెడ్డికి చంద్రబాబునాయుడు తాడిపత్రి టికెట్ కన్ఫర్మ్ చేశారని సమాచారం. జేసీ బ్రదర్స్ తో చాలాసేపు చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే తాడపత్రి టికెట్ అస్మిత్ రెడ్డికి ఓకే అయ్యింది. ఇదే సమయంలో మాజీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి కొడుకు జేసీ వపన్ రెడ్డికి కల్యాణదుర్గం టికెట్ ను మాత్రం చంద్రబాబు కుదరదని చెప్పినట్లు పార్టీవర్గాల సమాచారం.

కల్యాణదుర్గంలో తన కొడుకు పవన్ రెడ్డిని పోటీచేయించాలని దివాకరరెడ్డి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముందు అనంతపురం ఎంపీగానే పోటీచేయించాలని అనుకున్నా తర్వాత ఎందుకో కల్యాణదుర్గంపై దృష్టిపెట్టారు. అయితే ఇద్దరికి టికెట్లు ఇవ్వటానికి చంద్రబాబు అంగీకరించలేదు. పోయిన ఎన్నికల్లో పవన్ రెడ్డి అనంతపురం ఎంపీగా, అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎంఎల్ఏగా పోటీచేసి ఓడిపోయిన విషయం తెలిసిందే.

అప్పట్లో ఓడిపోయిన అస్మిత్ తాడిపత్రి మీదే ఫుల్ ఫోకస్ పెట్టారు. ఎలాగూ తండ్రి ప్రభాకరరెడ్డి మున్సిపల్ ఛైర్మన్ గా ఉన్నారు కాబట్టి రెగ్యులర్ గా బాగా యాక్టివ్ గా ఉన్నారు. ఇదే సమయంలో అనంతపురంలో ఓడిపోయిన పవన్ రెడ్డి స్ధిరంగా లేరు. ఒకసారి ఒక నియోజకవర్గమని మరోసారి ఇంకో నియోజకవర్గమని రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఇదే సమయంలో జేసీ బ్రదర్స్ తో జిల్లాలోని చాలామంది నేతలకు ఏమాత్రం పడదు. ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో తక్కువలో తక్కువ 8 నియోజకవర్గాల్లో తన మద్దతుదారులకే టికెట్లు ఇప్పించుకోవాలని బ్రదర్స్ చాలా ప్రయత్నాలు చేశారు.

అయితే ఆయా నియోజకవర్గాల్లోని మాజీమంత్రులు లేదా మాజీ ఎంఎల్ఏలు జేసీ బ్రదర్స్ ను అంతే ధీటుగా వ్యతిరేకించారు. దాంతో క్షేత్రస్ధాయిలో వ్యవహారాలపై రిపోర్టు తెప్పించుకున్న చంద్రబాబు బ్రదర్స్ ను రాబోయే ఎన్నికల్లో తాడిపత్రికి మాత్రమే పరిమితం అవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే బ్రదర్స్  రెండుసీట్లకు పట్టుబట్టినా చంద్రబాబు మాత్రం ఒక్కసీటునే కేటాయించారు. మరిపుడు పవన్ రెడ్డి ఏమిచేస్తారన్నది ఆసక్తిగా మారింది. 

This post was last modified on January 28, 2024 3:44 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

కాస్త సౌండ్ పెంచు పురుషోత్తమా

యూత్ హీరో రాజ్ తరుణ్ కు మంచి హిట్టు దక్కి ఎంత కాలమయ్యిందో చెప్పడం కష్టం. సీనియర్ హీరోలతో సపోర్టింగ్…

2 mins ago

బాలయ్య బ్యాక్ టు డ్యూటీ

ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు ఇంకో పద్దెనిమిది రోజుల్లో రాబోతున్నాయి. ఎవరికి వారు విజయం పట్ల ధీమాగా ఉన్నారు. అధికార పార్టీ,…

1 hour ago

పూజా హెగ్డే కోరుకున్న బ్రేక్ దొరికింది

మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…

3 hours ago

ఆమంచి .. ఎవరి ‘కొంప’ ముంచేనో ?!

ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…

3 hours ago

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

4 hours ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

4 hours ago