వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలు ఎక్కడం కష్టమని భావించిన వారిని వైసీపీ అధినేత జగన్ పక్కన పెట్టారు. ఇక, మారిస్తే ఫర్వాలేదు అనుకున్నవారిని మార్పులు చేశారు. వీరిలోనూ పరిస్థితి బాగుంటుందని అనుకుంటున్నవారినే కొనసాగించాలని నిర్ణయించారు. మరోవైపు.. కొందరి విషయంపై రహస్యంగా నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఇలాంటి వారిలో మంత్రి రోజా ముందున్నారని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. ఆమెకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే విషయం పార్టీలోనూ చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం నగరి నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు విజయం దక్కించుకున్న రోజా.. జగన్ కేబి నెట్‌లో మంత్రి కూడా అయ్యారు. మంత్రిగా ఆమె వైఖరి ఎలా ఉన్నా.. నియోజకవర్గంలో మాత్రం రెండో దఫ ఎన్నికైన తర్వాత మాత్రం మంత్రి బ్యాడై పోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆమె ఇద్దరు సోదరులు కూడా.. భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని.. వసూళ్ల కింగ్స్‌గా ఉన్నారని వైసీపీలోనే ఓ వర్గం నాయకులు చెబుతున్నారు. దీనికితోడు తాజాగా ఒక మహిళా కౌన్నిలర్ రోడ్డెక్కింది.
తనకు మునిసిపల్ చైర్మన్ పోస్టు ఇప్పిస్తానని చెప్పి.. 40 లక్షలు తీసుకున్నారంటూ ఆమె వ్యాఖ్యానించింది. మీడియా ముందే.. మంత్రి రోజాపై తీవ్ర విమర్శలు చేసింది. మరోవైపు నియోజకవర్గంలోనూ రోజా కు వ్యతిరేకంగా బ్యానర్లు వెలిశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా వైసీపీ అధిష్టానం నివేదికను తెప్పిం చుకుంది. ఈ నివేదికలో మంత్రి రోజాకు వ్యతిరేకంగానే అన్ని విషయాలు ఉన్నట్టు సమాచారం. వరుస విజయాలు కూడా కేవలం స్వల్ప మెజారిటీతోనే విజయం దక్కించుకున్నారని, ఆమె ప్రభావం ఇప్పుడు లేదని నివేదిక స్పష్టం చేసిందని అంటున్నారు.
ఇదిలావుంటే.. వైసీపీ కేడర్ కూడా రెండుగా చీలిపోయిన వ్యవహారం తెరమీదికి వచ్చింది. రోజాను సమర్థించే వారికన్నా.. ఆమెకు టికెట్ ఇవ్వద్దంటూ.. పంచాయతీలు, మండలస్థాయిలో తీర్మానాలు చేసే పరిస్తితి వచ్చింది. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా.. రోజా పేరు పెద్దగా వినిపించకపోగా.. ఆమెకు వ్యతిరేకంగా బ్యానర్లు కనిపిస్తున్నాయి. ఈ విషయాలను కూడా పార్టీ అధిష్టానం సేకరించిందని.. ఈ నేపథ్యంలో ఆమెకు టికెట్ ఇస్తారా? ఇవ్వరా? అనేది సందేహంలో పడిందని అంటున్నారు పరిశీలకులు
This post was last modified on January 27, 2024 11:24 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…