ఆయన ఎమ్మెల్యే. పైగా.. ఇద్దరు ఉద్ధండులను(కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి)లను ఓడించి మరీ విజయం దక్కించుకున్నారు. అంతేకాదు.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేత. అయినా.. ఎక్కడా ఆయన గర్వం లేదు. అధికార దర్పం అంతకన్నా లేదు. పైగా.. అధికారంతో సిఫారసులు చేసుకునో.. గద్దించో కూడా పనులు చేయించుకోవాలని ఆలోచించడం లేదు. ప్రజల చేత, ప్రజల వలన అన్నట్టుగా.. ప్రజల మనిషిగా గెలుపొందిన ఆయన ప్రజల కోసం.. తను ఎంత వరకు దిగిరావాలో అంతా దిగి వస్తున్నారు. ఆయనే కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి.
ఏం జరిగింది?
సాధారణంగా ఎక్కడైనా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కాల్వలు నిర్మించడం, రహదారులు విస్తరించడం తెలిసిందే. ఇలా విస్తరించాల్సిన అవసరం ఉన్నప్పుడు.. విస్తరణకు అడ్డుగా ఉన్న స్థలాలు, లేదా భవనాలను తొలగించేందుకు అధికారులు కోరతారు. సాధారణ ప్రజల నుంచి మధ్యతరగతి, ఉన్నత స్థాయి వర్గాలకు కూడా ఇలా రహదారుల వెడల్పుతో తొలగింపులు తప్పవు. ఈ క్రమంలో సాధారణ ప్రజలు ఆందోళనకు దిగడం సహజంగా కనిపించేదే. ఇక, ఉన్నతస్థాయి వర్గాలు కోర్టు కువెళ్లో.. పైనుంచి సిఫారసులు చేసుకునే ఈ కూల్చి వేతలు, తొలగింపుల నుంచి ఉపశమనం పొంది.. రహదారులను అడ్డుకున్న పరిస్థితి కూడా ఉంది.
ఇలానే.. కామారెడ్డి నియోజకవర్గంలోనూ .. మునిసిపల్ అధికారులు రహదారిని విస్తరించాలని అనుకున్నారు. ఇది సరిగ్గా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటి ముంగటి రోడ్డే కావడం గమనార్హం. దీంతో సాధారణ ప్రజలకు మాదిరిగానే .. ఎమ్మెల్యే ఇంటిలోని కొంత భాగాన్ని తొలగిస్తే.. తప్ప.. రహదారి విస్తరణ సాధ్యం కాదని అధికారులు గుర్తించారు. దీంతో అందరిలాగానే ఆయనకు కూడా నోటీసులు జారీ చేశారు. అయితే.. ఇక్కడ ఎమ్మెల్యే కనుక.. పైగా సిట్టింగ్ నియోజకవర్గం కాబట్టి.. ఆయన తనదైన శైలిలో సిఫారసులు చేసో.. కోర్టుకు వెళ్లో.. అధికారులను లోబరుచుకునో.. విస్తరణలో తన ఇంటికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా తప్పించుకునే అవకాశం ఉంది.
కానీ, అలా చేయలేదు. అలా చేస్తే..ఇప్పుడు ఇలా వార్తల్లోకి కూడా వచ్చేవారు కాదేమో. వెంకటరమణారెడ్డి పెద్దమనసుతో వ్యవహరించారు. హుందాగా ముందుకు వచ్చారు. తన ఇంటి ముందు రహదారి విస్తరణ చేపట్టేందుకు.. ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాల్సిన బాధ్యత తనమీద ఉందని చెబుతూ.. మొట్టమొదట తన ఇంటి నుంచే కూలగొట్టే కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. అంతేకాదు.. స్వయంగా తనే దగ్గర ఉండి..రహదారి విస్తరణకు అవసరమైన స్థలానికి తన ఇంటి ప్రాంగణాన్ని కూలగొట్టి అధికారులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైలర్ అయింది. ఎమ్మెల్యేకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
This post was last modified on January 27, 2024 11:20 pm
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…
అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…