Political News

అటు వైసీపీ-ఇటు టీడీపీ ఒకే సారి రాష్ట్రంలో విజృంభ‌ణ‌!

ఏపీలో ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న‌కు ముందే.. ప్ర‌చార ప‌ర్వం దాదాపు ప్రారంభమైపోయింది. ఇప్ప‌టికే టీడీపీ అదినేత చంద్ర‌బాబు నాయుడు రా..క‌ద‌లిరా! స‌భ‌ను రాష్ట్ర వ్యాప్తంగా ప‌రుగులు పెట్టిస్తున్నారు. ఎంపిక చేసిన నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆయ‌న ఈ స‌భ‌లు పెడుతూ.. పార్టీప‌రంగా నాయ‌కుల‌ను న‌డిపిస్తున్నారు. ఇదేస‌మ‌యంలో అభ్య‌ర్థుల ఎంపిక‌పైనా.. ఆయ‌న దృష్టి పెట్టారు. అంటే దాదాపు రా..క‌ద‌లిరా! స‌భ ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని నేరుగా చేప‌ట్ట‌లేదు. ఎక్క‌డైనా వివిధ సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు సంబంధించి సీఎం జ‌గ‌న్ బ‌ట‌న్ నొక్కి నిధులు విడుద‌ల చేయాల‌ని అనుకున్న‌ప్పుడు మాత్ర‌మే.. ఆయా స‌భ‌ల్లో జ‌గ‌న్ ప్ర‌సంగిస్తున్నారు. విప‌క్షాల‌ను టార్గెట్ చేస్తున్నారు. కానీ, ప్ర‌త్యేకంగా ఎన్నిక‌ల కోసం.. ఇప్ప‌టి వ‌ర‌కు స‌భ పెట్ట‌లేదు. కానీ, తాజాగా శ‌నివారం నుంచి వైసీపీ కూడా రెడీ అయిపోయింది. మేం వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సిద్దంగా ఉన్నామ‌ని చెబుతూ.. అదే పేరు(సిద్ధం)తో స‌భ నిర్వ‌హిస్తోంది.

విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని భీమిలి నియోజ‌క‌వ‌ర్గం శివారులో దాదాపు 14 ఎక‌రాల స్థ‌లంలో భారీ ఎత్తున సిద్ధం స‌భ‌ను నిర్వ‌హిస్తున్నారు. ఈ స‌భ‌కు 3 ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌ల‌ను తీసుకురావాల‌ని ల‌క్ష్యంగా నిర్దేశించుకు న్నారు. గ‌తంలో టీడీపీ నేత నారా లోకేష్ చేసిన‌ ‘యువ‌గ‌ళం’ పాద‌యాత్ర ముగింపు సందర్భంగా.. ఇదే జిల్లాలోభారీ స‌భ‌ను నిర్వ‌హించింది. దీనిని ఎన్నిక‌ల శంఖారావంగా చంద్ర‌బాబు పేర్కొన్నారు. దీంతో ఇక్క‌డే వైసీపీ కూడా ప్లాన్ చేసింది. శ‌నివారం ఈ స‌భ‌ను విజ‌య‌వంతం చేసేందుకు ప‌క్కా స్కెచ్‌తో ముందుకు సాగుతోంది.

మ‌రోవైపు శ‌నివారం నుంచి నిర్విరామంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా జ‌నంలోకే వ‌స్తున్నారు. వ‌రుసగా ఆయ‌న రోజుకు రెండు స‌భ‌లు పెట్ట‌డం ద్వారా.. ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌ల‌ను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. పీలేరు, ప‌త్తికొండ‌, నెల్లూరు, రాజ‌మండ్రి రూర‌ల్ ఇలా.. వ‌రుస‌గా చంద్ర‌బాబు కూడా.. స‌భ‌ల‌కు హాజ‌రు కానున్నారు. వైసీపీ శ‌నివారం నుంచి వ‌రుస‌గా స‌భ‌ల‌కు ప్లాన్ చేస్తుండ‌డంతో మొత్తంగా ఏపీలో రాజ‌కీయాలు మ‌రింత వేడెక్క‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది.

This post was last modified on January 27, 2024 3:56 pm

Share
Show comments

Recent Posts

మాకు సలహాలు ఇవ్వండి బిల్ గేట్స్‌కు చంద్ర‌బాబు ఆహ్వానం

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఐటీ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు,…

33 minutes ago

శార‌దా ‘స్వామి’ తిరుమల లో చేసింది తప్పే

విశాఖ‌ప‌ట్నంలోని శార‌దాపీఠం అధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్ర‌చారంలో ఉన్న విష‌యం తెలిసిందే. వైసీపీ హ‌యాంలో ఆయ‌న చుట్టూ…

37 minutes ago

రిలయన్స్ న్యూ కరెన్సీ.. జియో కాయిన్

ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…

44 minutes ago

ఎన్నాళ్లకెన్నాళ్లకు?… గల్లా రీయాక్టివేట్ అయినట్టేనా?

గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…

1 hour ago

బాబు, రేవంత్ మ‌రో సీఎం.. ఫోటో వైర‌ల్‌

దావోస్ లో జ‌రుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ స‌మావేశం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాల‌కులు, వ్యాపార‌వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తున్న సంగ‌తి…

2 hours ago

కాళేశ్వరం వివాదం.. కీలక వివరాలతో వచ్చిన వి.ప్రకాశ్

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…

2 hours ago