సీఎం కేసీఆర్ పై కేసు నమోదు చేయాలని తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. కేసీఆర్ హయాంలో కోకాపేటలో 11 ఎకరాల భూమిని అతి తక్కువ ధరకు బీఆర్ఎస్ భవనానికి కేటాయించిన వ్యవహారంలో కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కోట్ల రూపాయల విలువైన ఆ భూమిని బీఆర్ఎస్ కు కేటాయించడంపై హైకోర్టులో గతంలో దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపి ఈ ఆదేశాలు జారీ చేసింది. సర్వే నెంబర్ 239, 240లో 11 ఎకరాలను సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ పేరుతో మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు కేటాయించారని పిటిషన్ దాఖలైంది.
ఎకరా రూ.50 కోట్ల విలువైన భూమిని రూ.3.41 కోట్లకే కేటాయించారని, 5 రోజుల్లోనే పూర్తయిన ఈ ప్రక్రియ వల్ల ఖజానాకు 1100 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని పిటిషనర్ పేర్కొన్నారు. ఆ భూ కేటాయింపును రద్దు చేసి, ఏసీబీ కేసు నమోదు చేసేలా ఆదేశించాలని కోరారు. ఆ పిటిషన్ లో ప్రతివాదులుగా మాజీ సీఎం కేసీఆర్ పేరు కూడా ఉండడంతో ఆయనపై, సంబంధిత రెవెన్యూ అధికారులపై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
కాగా, కేసీఆర్ ను పులితో పోల్చిన రేవంత్ రెడ్డి…ఆయనను త్వరలోనే బోనులో వేస్తామంటూ వ్యాఖ్యలు చేసిన రోజే కేసీఆర్ పై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పులి బయటకు వస్తుందని బిల్లా, రంగా ఊరూరా ప్రచారం చేస్తున్నారని, పులి బయటకు వస్తే బోను రెడీగా ఉందని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చార్లెస్ శోభరాజ్ ఇంట్లో పడుకున్నారని, బయటకు రావాలని పరోక్షంగా కేసీఆర్ పై షాకింగ్ కామెంట్లు చేశారు. ఇచ్చిన హామీ నెరవేర్చని బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ గ్యారెంటీలపై ప్రశ్నించే అర్హత ఉందా? అని నిలదీశారు. 100 రోజుల్లో 6 హామీలు పూర్తి చేస్తామన చెప్పామని, కానీ, 50 రోజులు గడవక ముందే బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
This post was last modified on January 25, 2024 11:34 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…