తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ లపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలతో విరుచుకుపడ్డారు. 3650 రోజులు తెలంగాణ ఏలిన మీరు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదు, మైనారిటీలకు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేదని రేవంత్ నిలదీశారు. అటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు కూడా పూర్తి కాకముందే బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి అంటూ కేటీఆర్ చేసిన కామెంట్లపై కూడా ఆయన ఘాటుగా స్పందించారు.
తాను గుంపు మేస్త్రీనేనని, బీఆర్ఎస్ నేతలు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రిని తానేనని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలకు ఘోరీ కట్టే మేస్త్రిని కూడా తానేనని మాస్ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన టిపిసిసి సమావేశంలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెలలోనే ఇంద్రవెల్లి వస్తానని, కాచుకోవాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ సంపదను దోచుకున్నవారిని కేసీఆర్ రాజ్యసభ సభ్యులు చేశారని ఆరోపించారు. 50వేలు కూడా లేకపోయినా మందుల శామ్యూల్ కు టికెట్ ఇచ్చి 52 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించుకున్నామని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ దయ వల్లే తాను ముఖ్యమంత్రి అయ్యానని రేవంత్ అన్నారు. తాము ఇచ్చిన 6 హామీలలో మరో రెండు హామీల అమలు కోసం సిద్ధమయ్యామని, ఫిబ్రవరి నెల ఆఖరుకు రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలో మోడీకైనా, రాష్ట్రంలో కేసీఆర్ కైనా బుద్ధి చెప్పేది కాంగ్రెస్ పార్టీ అని షాకింగ్ కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర వల్లే కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని చెప్పుకుచ్చారు. అఖండ భారత్ అని చెబుతున్న మోడీ… దేశం కోసం గాంధీ కుటుంబ సభ్యులు ప్రాణాలు అర్పిస్తున్నప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు.
This post was last modified on January 25, 2024 10:31 pm
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…