కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల.. ఆ పార్టీ కోసం, ఎక్కడో సుప్తచేతనావస్థలో ఉన్న పార్టీకి జవజీవాలు అందించడం కోసం.. ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు. కోల్డ్ స్టోరేజీకి చేరిపోయిన కాంగ్రెస్ పార్టీని తిరిగి పట్టాలెక్కించేందుకు ఆమె తన శక్తియుక్తులు జోడిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీని టార్గెట్ చేసుకుని.. పర్యటనలకు శ్రీకారం చుట్టారు. అయితే.. ఈ క్రమంలో ప్రజలకు ఆమె చెప్పేది ఎలా ఉన్నప్పటికీ.. ప్రజల నుంచి కూడా షర్మిలకు అదే రేంజ్‌లో కొన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
వైసీపీ పాలనపై షర్మిల దూకుడు ఆమెకు కానీ…పార్టీకి కానీ.. ఏమేరకు ప్రయోజనం చేకూరుస్తుందనే చర్చ సాగుతోంది. ఎందుకంటే.. గత ఐదేళ్ల కిందట ఇదే వైసీపీ కోసం.. ఇదే జగన్ కోసం.. ఆమె పాదయాత్ర చేసింది. ఈ విషయాలేవీ ప్రజల మనసుల నుంచి తొలిగిపోలేదు. పైగా.. అసలు జగన్‌తో ఎందుకు విభేదించాల్సి వచ్చింది? పొరుగు రాష్ట్రంలో సొంత పార్టీ పెట్టుకుని.. దానిని కాంగ్రెస్‌లో ఎందుకు విలీనం చేయాల్సి వచ్చింది? ఇప్పుడు ఏపీలో ఎందుకు అడుగులు వేయాల్సి వచ్చింది? అనే ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
తెలంగాణ కోడలినంటూ.. వైఎస్ బిడ్డనంటూ.. అక్కడ రాజన్న రాజ్యం ఏర్పాటు చేస్తానంటూ.. అరంగే ట్రం చేసిన షర్మిల.. సొంత కుంపటి పెట్టుకుని మూణ్ణాళ్లకే కాంగ్రెస్‌లో కలిపేశారు. పాదయాత్ర చేసి.. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో నిజంగానే ఆమెను నమ్ముదామనే అభిప్రాయం ప్రజల్లో వచ్చింది. కానీ, ఇంతలోనే ఆమె కాంగ్రెస్ పార్టీ చెంతకు చేరిపోవడం.. ఆ పార్టీలో తన పార్టీని విలీనం చేయడం చూశాక.. రాజకీయాల్లో ఇలా కూడా జరుగుతుందా? అని అందరూ అనుకున్నారు.
ఇక, తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని చెప్పుకొన్న షర్మిల.. ఇప్పుడుఏపీపై ఫోకస్ పెంచారు. గత ఐదేళ్ల ముందు.. వైసీపీ కోసం పనిచేసి.. ఇదే కాంగ్రెస్‌ను చడా మడా తిట్టిపోసిన షర్మిల.. ఇప్పుడు యూటర్న్ తీసుకుని ప్రజల మధ్య వచ్చి.. అదే కాంగ్రెస్‌ను కీర్తిస్తూ.. బజనలు చేస్తే.. ప్రజలు ఎలా విశ్వసిస్తారని అనుకుంటారో.. ఆమె చెప్పాలి. అంతేకాదు.. అసలు ఎందుకు నమ్మాలనే వాదన కూడా వస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత.. వైసీపీ ఏదో ఒక రాష్ట్రాన్నిఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఏపీకే పరిమితమైంది. తెలంగాణను పక్కన పెట్టింది.
కానీ, షర్మిల తొలుత ఏపీని వదిలేసి.. ‘ఆ రాష్ట్రంతో మాకేం సంబంధం ‘ అని వ్యాఖ్యలు చేసి.. ఇప్పుడు అదే రాష్ట్రాన్ని ఉద్దరిస్తానంటూ రావడం వెనుక ఉన్న మర్మం ఏంటో కూడా ప్రజలకు చెప్పాల్సి ఉంది. అప్పటి వరకు ఆమె ఎంతగా ప్రయాస పడినా ప్రయోజనం లేదనే అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on January 25, 2024 9:56 am
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్‌ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…