కిమ్ జాంగ్ వున్.. ఈ ఉత్తర కొరియా నియంత గురించి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పరమ దుర్మార్గుడు, కఠినాత్ముడిగా పేరున్న కిమ్ అనారోగ్యంతో చనిపోయినట్లుగా కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. కొందరేమో అతను బ్రెయిన్ డెడ్ అయ్యాడని.. కోమాలో ఉన్నాడని.. బతికి ఉన్నా చచ్చినట్లే అని అంటున్నారు.
ఇంకొందరేమో అతడి ప్రాణాలు పోయాయని చెబుతున్నారు. దీనిపై ఉత్తర కొరియా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కిమ్ గురించి వస్తున్న వార్తల్ని ఖండించనూ లేదు. అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న వార్తలు చూస్తుంటే మాత్రం కిమ్ సాధారణ స్థితిలో అయితే లేడన్నది స్పష్టమవుతోంది. అతను చనిపోవడమో.. కోమాలోకి వెళ్లడమో నిజమే అయితే ఉన్నట్లుండి అంత విషమ పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నది సస్పెన్స్.
దీని వెనుక అసలేం జరిగిందో ఓ అంతర్జాతీయ పత్రిక కథనం ప్రచురించింది. కిమ్ ఇటీవల ఒక పర్యటనలో ఉండగా.. అతడికి గుండె పోటు వచ్చిందని.. ఐతే ఆసుపత్రికి తీసుకెళ్లడంలో ఆలస్యం జరగడంతో పరిస్థితి విషమించిందని అంటున్నారు.
అత్యవసరంగా శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశారని.. ఐతే కిమ్ గుండెలో స్టంట్ వేయబోతుండగా.. డాక్టర్ చేతులు విపరీతంగా వణికాయని.. దీంతో శస్త్రచికిత్సలో తేడా జరిగిందని.. దీంతో అతడి పరిస్థితి విషమించిందని ఆ కథనంలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. కిమ్ నుంచి అతడి సోదరి కిమ్ జయో జాంగ్ అధ్యక్ష పదవిని అందుకోబోతోందని.. ఆమె కిమ్‌ను మించిన నియంత, కఠినాత్మురాలు అని.. ఇంతకుముందే అనేక దారుణాల్లో ఆమె పాలుపంచుకుందని చెబుతున్నారు. కిమ్‌కు ఈ పరిస్థితి రావడంలో సోదరి కుట్ర ఉండొచ్చనే కోణంలో కూడా వార్తలొస్తుండటం గమనార్హం….
This post was last modified on April 26, 2020 3:13 pm
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా వెలుగు చూసిన హెచ్ ఎంపీవీ వైరస్ విషయంలో వ్యక్తిగత జాగ్రత్తలకు ప్రాధాన్యం ఇచ్చారు.…
ప్రస్తుతం ఐటీ రంగంలో ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం దేశవ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగులు బెంగళూరుకు క్యూ కడుతున్నార ని.. భవిష్యత్తులో కుప్పానికి…
హిట్లు ఫ్లాపులు పక్కనపెడితే విజయ్ దేవరకొండ నిర్మాతలు బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా భారీ ప్యాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు.…
పది రోజుల క్రితం వచ్చిన లీక్ నిజమయ్యింది. పుష్ప 2 ది రూల్ కు అదనంగా 20 నిమిషాల ఫుటేజ్…
ఇటీవలే స్ట్రీమింగ్ మొదలుపెట్టిన అన్ స్టాపబుల్ 4 డాకు మహారాజ్ ఎపిసోడ్ లో బాలయ్య దర్శకుడు బాబీతో జరిపిన సంభాషణలో…
ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్లలో ఒకడిగా ఉండేవాడు దిల్ రాజు. ప్రతి సినిమాతో హిట్టు కొట్టడం ఎవరికీ…