టీడీపీ అధినేత చంద్రబాబుకు పనితగ్గుతుందా? ఆయన ఇక, తన ఆవేశాన్ని.. పార్టీకే పరిమితం చేసు కుంటే సరిపోతుందా? ఇక నుంచిఆయన వైసీపీ సర్కారుపై పెద్దగా నోరు చేసుకోవాల్సిన అవసరం కూడా తగ్గుతుందా?.. ఇవీ ప్రస్తుతం టీడీపీ రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తున్న అంశాలు. దీనికి ప్రధాన కారణం.. ఇప్పటి వరకు వైసీపీపైనా.. వైసీపీ పాలనపైనా ఎవరూ చేయని విధంగా విమర్శలు చేస్తూ.. ఎవరూ కార్నర్ చేయని అంశాలను కూడా కార్నర్ చేస్తూ.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల రెచ్చిపోయారు. నిప్పులు చెరిగారు.
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో షర్మిల చేసిన ప్రసంగాలు గమనిస్తే.. అంత సాదాసీదాగా లేవనే అనిపిస్తుంది. నిజానికి ఇప్పటి వరకు వైసీపీపై ఇటు టీడీపీ, అటు బీజేపీ, మరోవైపు జనసేనలు విరుచు కుపడుతున్నాయి. కానీ.. తాజాగా షర్మిల చేసిన వ్యాఖ్యలు ప్రసంగాలు మాత్రం.. ఈ పార్టీలు ఇప్పటి వరకు చేసిన విమర్శలను తోసిపుచ్చి.. ఓ రేంజ్‌లోకి వెళ్లిపోయాయి. మద్య నిషేధం చేస్తే తప్ప ఓట్లు అడగను.. అని చెప్పి.. ఇప్పటి వరకు మద్యనిషేధంఎందుకు చేయలేదంటూ.. షర్మిల అడిగిన ప్రశ్న ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా అడగలేదు.
ఇక, కాంగ్రెస్ నేతగానే వైఎస్ ను చూడాలని.. వైఎస్ కొడుకే కానీ.. వైఎస్ పాలనను అందించడంలో జగన్ వేస్ట్ అని షర్మిల దూకుడుగా వ్యాఖ్యానించారు. ఇక, మిగిలిన వ్యాఖ్యలు కామన్‌గా అందరూ చేసేవే అయినా.. కొన్ని కొన్ని విషయాలను మాత్రం షర్మిల గట్టిగానే ప్రశ్నించారు. ఈ ప్రసంగాలు.. ఈ దూకుడు చూసిన తర్వాత.. ఇప్పటి వరకు ప్రతిపక్షాలు వైసీపీపై చేసిన విమర్శల ఒక ఎత్తు.. షర్మిల ఒక్క రు ఒక ఎత్తు అన్నటాక్ వినిపిస్తోంది. దీంతో ఇక, చంద్రబాబు ప్రశాంతంగా తన పార్టీ కార్యక్రమాలు చేసుకుంటే సరిపోతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇప్పటి వరకు చంద్రబాబు పార్టీ కోసం.. వైసీపీని నిలువరించడం కోసం చాలానే శ్రమించారు. అయితే.. ఇప్పుడు ఆయన చేయాల్సిన పనిని షర్మిల మరింత ఎక్కువగా చేస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలో చంద్రబాబు పెద్దగా శ్రమపడకుండానే వైసీపీకి చెక్ పెట్టొచ్చని అంటున్నారు. పోనీ.. మాట్లాడాలని అనుకున్నా.. కొత్త సబ్జక్లు అవసరం ఉంటుందని చెబుతున్నారు. మరి చంద్రబాబు వచ్చే రెండు మాసాలు పార్టీకోసం కేటాయించి.. అభ్యర్థుల ఎంపిక, ప్రచారానికే పరిమితం అవుతారేమో చూడాలి.
This post was last modified on January 24, 2024 4:43 pm
ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ లో నటించాక ఏ హీరోయిన్ కైనా ఆఫర్ల వర్షం కురుస్తుంది. కానీ కెజిఎఫ్ రెండు భాగాల్లో…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు పెద్ద సినిమాలు సెట్స్ మీదుంచి వాటిని బ్యాలన్స్ చేయడం ఎంతటి అగ్ర నిర్మాతలకైనా సరే…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గాలి భానుప్రకాష్ నాయుడు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…
ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని…
దర్శకుడు, నటుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన ఏం మాట్లాడి నా ఆలోచించి.. మాట్లాడతారు.. ఏం…