రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పదవుల పంపిణీలో ఆచితూచి వ్యవహరిస్తోంది. అందులోను మొన్నటి ఎన్నికల్లో టికెట్లను త్యాగం చేసినవారికి, పార్టీ గెలుపుకోసం కష్టపడిన వారికే పదవుల పంపిణీలో టాప్ ప్రాయారిటి ఇవ్వాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. ఇదే విషయాన్ని అధిష్టానంతో చెప్పి ఆమోదం పొందిన తర్వాత పదవుల కేటాయింపు మొదలుపెట్టారు. మల్లురవి, వేం నరేందర్ రెడ్డి, హర్కార వేణుగోపాల్, షబ్బీర్ ఆలీని ప్రభుత్వ సలహదారులుగా నియమించటం ఇందులో భాగమే.
మల్లు, హర్కార, వేంలు పోయిన ఎన్నికల్లో పోటీచేయలేదు. ఇక షబ్బీర్ ఆలీ నిజామాబాద్ రూరల్లో పోటీచేసి ఓడిపోయారు. టికెట్లను త్యాగంచేసినందుకు మొదటి ముగ్గురికి నామినేటెడ్ పోస్టులు దక్కాయి. పోటీచేసి ఓడిపోయినా షబ్బీర్ కు పదవి ఎందుకు దక్కిందంటే ముస్లిం మైనారిటి ఓట్లను కాంగ్రెస్ కు పడేట్లు కష్టపడినందుకట. పైగా పార్టీ తరపున పోటీచేసిన ముస్లిం అభ్యర్ధులందరు ఓడిపోయారు. తొందరలోనే జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో ముస్లింల ఓట్లు చాలా కీలకం. అందుకనే షబ్బీర్ కు సలహాదారు పదవిని కట్టబెట్టారు.
ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ఎంఎల్సీ పదవి ద్వారా మంత్రవ్వాలన్న షబ్బీర్ ఆశలపై రేవంత్ నీళ్ళు చల్లేశారు. షబ్బీర్ విషయంలో రేవంత్ తీసుకున్న నిర్ణయం మంచిదనే పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. పోటీకి అవకాశం దక్కని వాళ్ళకి, గెలుపుకోసం కష్టపడిన వారికి ఎంఎల్సీలుగా అవకాశం ఇవ్వాలని పార్టీలో చాలామంది సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఆ కోణంలో చూస్తే షబ్బీర్ ను పోటీనుండి తప్పించటం మంచిదే అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
ఇదే పద్దతిలో తొందరలోనే మరో 20మందికి నామినేటెడ్ పోస్టుల యోగం పట్టబోతున్నట్లు పార్టీలో టాక్ వినబడుతోంది. విడతలవారీగా చేయబోయే నామినేటెడ్ పోస్టుల్లో కార్పొరేషన్ ఛైర్మన్లను సామాజికవర్గాల సమతూకంగా నియమించబోతున్నారట. లిస్టు ఫైనల్ కాగానే అధిష్టానంకు పంపించి గ్రీన్ సిగ్నల్ తీసుకోబోతున్నారు. అనుమతి రాగానే వెంటనే నియామకాలు అయిపోతాయని సమాచారం. కష్టపడిన వారికి పార్టీలో గుర్తింపు ఉంటుందనే సిగ్నల్ ఇవ్వటం కోసమే ఈ నియామకాలను చేయబోతున్నారు. మొదటి విడత భర్తీని ఇపుడు చేసి రెండో విడత భర్తీని పార్లమెంటు ఎన్నికల తర్వాత చేయాలని అనుకున్నట్లు సమాచారం.
This post was last modified on January 24, 2024 11:51 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…