అత్యంత వివాదాస్పదమైన మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంపై విజిలెన్స్ ఉన్నతాధికారులు రెడీచేస్తున్న నివేదిక సంచలనంగా మారింది. ఎన్నికల సమయంలో మేడిగడ్డ బ్యారేజి నిర్మాణంలోని నాసిరకమంతా నివేదికలో బయటపడిందిట. బ్యారేజి పిల్లర్లు కొన్ని కుంగిపోవటం సంచలనమైంది. బ్యారేజి నాణ్యతపై కాంగ్రెస్, బీజేపీలు సంధించిన ప్రశ్నలకు కేసీయార్, కేటీయార్, హరీష్ రావు సమాధానం కూడా చెప్పుకోలేకపోయారు. రేవంత్ రెడ్డి అండ్ కో ఎన్నిసార్లు ప్రశ్నించినా కేసీయార్ మేడిగడ్డ ప్రాజెక్టుపై మాట్లాడకపోవటమే కాకుండా ఎవరినీ మాట్లాడద్దని అప్పట్లో ఆదేశించారని వార్తలొచ్చిన మాట అందరికీ తెలిసిందే.
దాంతో కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని, మేడిగడ్డ బ్యారేజి అత్యంత నాసిరకంగా నిర్మించారనే ఆరోపణలతో కాంగ్రెస్ చెలరేగిపోయింది. ఇలాంటి అనేక ఆరోపణలకు కేసీయార్ సమాధానం చెప్పుకోలేకపోవటంతో చివరకు ఓటమి తప్పలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మేడిగడ్డ బ్యారేజి నాణ్యతపైన విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్ నాయకత్వంలో కొందరు నిపుణుల సాయంతో మేడిగడ్డ బ్యారేజికి సంబంధించిన ఫైళ్ళను అధ్యయనం చేశారు. తర్వాత దీనిపైన ప్రభుత్వానికి రిపోర్టు అందించబోతున్నారు.
ఆ రిపోర్టులో బ్యారేజి నిర్మాణం సమస్ధం అత్యంత నాసిరకంగా చేసినట్లు చెప్పబోతున్నట్లు సమాచారం. నిపుణులతో మాట్లాడినపుడు వాళ్ళు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారట. విజిలెన్స్ తరపున ఇరిగేషన్ ఫీల్డులో బాగా అనుభవం ఉన్న కొందరు నిపుణులు నాలుగు రోజులు మేడిగడ్డను అధ్యయనం చేశారట. ప్రాజెక్టు నిర్మాణమే అత్యంత నాసిరకంగా జరిగిందని, నిర్మాణం తర్వాత కూడా నిర్మాణ సంస్ధ నిర్వహణ సరిగా లేదని నిపుణులు అభిప్రాయపడ్డారట. నిర్మాణానికి, నిర్వహణ సరిగా లేకపోవటానికి నిర్మాణ సంస్ధ ఎల్ అండ్ టి సంస్ధదే బాధ్యతగా తేల్చారట.
అసలు బ్యారేజి పునాదుల్లోనే అవినీతి జరిగిన కారణంగానే పిల్లర్లు కుంగిపోయినట్లు నిపుణులు తేల్చారు. 75 ఏళ్ళు అత్యంత పటిష్టంగా ఉండాల్సిన బ్యారేజి నాలుగేళ్ళకే నాసిరకంగా తయారైందంటే అందుకు నిర్మాణ సంస్ధతో పాటు అప్పటి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని నిపుణులు తేల్చారట. ఇరిగేషన్ శాఖలో ప్రాజెక్టు ఇన్చార్జిలు కూడా బాధ్యత వహించాల్సిందే అని నిపుణులు తేల్చారు. సుమారు రు. 4 వేల కోట్లతో నిర్మించిన బ్యారేజి ఇపుడు ఎందుకూ పనికిరాకుండా పోయిందని నిపుణులు అభిప్రాయపడ్డారట. ప్రాజెక్టులో పూర్తి నీటి నిల్వచేస్తే ఇంకెంత ప్రమాదం బయటపడుతుందో అని నిపుణులు ఆందోళన వ్యక్తంచేసినట్లు సమాచారం. మొత్తంమీద వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయ్యిందన్నది వాస్తవం.
This post was last modified on January 23, 2024 12:07 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…