జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను రాజకీయంగా ఉన్నత స్థాయిలో చూడాలనేది కాపు సామాజిక వర్గం అభిలాష.. ఆశ కూడా. ఈ క్రమంలోనే కాపులు అంతా సంఘటితం కూడా అవుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇంత వరకు బాగానే ఉంది. అయితే.. ఇప్పుడు గత రెండు వారాలుగా కాపులు మౌనంగా ఉన్నారు. ఇంతకు ముందుకు.. ఇప్పటికి.. చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. గతంలో పవన్ కోసం.. ఏమైనా చేసేందుకు రెడీ అన్న కొందరు నాయకులు ఇప్పుడు ఇంటికే పరిమితం అయ్యారు.
ఒక్క యువత మాత్రమే పవన్ గురించి, జనసేన గురించి ఎక్కువగా చర్చిస్తోంది. అయితే.. వీరంతా ఎన్నికల సమయానికి పోలింగ్ బూతులకు వస్తారా? అనేది ప్రశ్న. అంతేకాదు..ఓటు వేస్తారా? అనేది కూడా మరోప్రశ్న. ఇలా..ఏవిధంగా చూసుకున్నా.. పవన్‌పై ఈ వర్గం నాయకులు, యువత ఆశలు పెట్టుకున్నారు. కానీ, అనూహ్యంగా రాష్ట్రంలో మారిన, మారుతున్న రాజకీయ పరిణామాలతో కాపు సామాజిక వర్గం మౌనంగా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఒకప్పుడు పవన్ సీఎం కావాలని అనుకున్నవారంతా.. పవన్‌ను సీఎంగా చూడాలని భావించిన వారంతా కూడా.. ఇప్పుడు నోరు మెదపడం లేదు. దీనిని బట్టి .. పవన్ ఆలోచనలను వారు సరిగా అర్ధం చేసుకోలేక పోతున్నారా? లేక.. పవన్ తమ దారిలోకే రావాలని భావిస్తున్నారా? అనేది చర్చగా మారింది. ప్రస్తుతం ఏపీ ఉన్న పరిస్థితిలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు.. చంద్రబాబు వంటి దార్శనికుడు కావాలని పవన్ ఇటీవల కాలంలో పదే పదే చెబుతున్నారు.
అంటే.. దాదాపు సీఎం సీటును తాను త్యాగం చేస్తున్నానని పవన్ ఒప్పేసుకున్నారు. మరి ఈ త్యాగాన్ని పవన్ అభిమానులు కానీ, ఆయన పార్టీ క్షేత్రస్థాయిలో నాయకులు కానీ, అర్ధం చేసుకోలేక పోతున్నారా? అనేది ప్రశ్న. ఇదిలావుంటే..తనను సీఎంగా చూడాలని అభిమానులు పదే పదే కోరుతున్నా.. పవన్ మాత్రం రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని.. ఆ స్థానాన్ని త్యాగం చేశారు. ఇప్పటికే దీనిపై క్లారిటీ ఇచ్చారు. దీనిని ఇప్పటికైనా కేడర్ అర్థం చేసుకోవాల్సి ఉంది. పార్టీని ముందుకు నడిపించాల్సి ఉంది. లేకపోతే.. ఇరు పక్షాలు కూడా.. మరో ఐదేళ్ల పాటు ఎదురు చూపులకే పరిమితం కావాల్సి ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on January 23, 2024 8:16 am
విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు మరో కీలక మలుపు తీసుకుంది. గోపాలపురం ఎయిర్పోర్టు…
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఇప్పుడు నిజంగానే ఫుల్ రిలీఫ్ దొరికిందని చెప్పాలి. తన తాజా చిత్రం…
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్యాగ్ ని సంవత్సరాల తరబడి మోస్తున్న ప్రభాస్ పెళ్లి శుభవార్తని వినాలనే కొద్దీ ఆలస్యమవుతూనే…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతగా ఓ రేంజిలో ఎలివేషన్లు దక్కించుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా నిజంగానే పండుగ పూట…
గత డిసెంబర్ లో సర్వం సిద్ధం చేసుకుని పూజా కార్యక్రమాలతో సినిమా మొదలవుతుందని అందరూ ఎదురు చూస్తున్న టైంలో మోక్షజ్ఞ…
నిన్న విడుదలైన గేమ్ ఛేంజర్ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోనప్పటికీ మిక్స్డ్ టాక్ తోనూ క్రమంగా పుంజుకుంటుందనే నమ్మకంలో…