Political News

రామ మందిరం సాక్షిగా.. అప్పుడు 300.. ఇప్పుడు 400?

రాజకీయాల్లో రామ‌మందిరం చేరిపోయింది. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుత అయో ధ్య రామమందిర ప్ర‌తిష్టా ప‌నులు.. దీనికి సంబంధించి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తీసుకున్న చ‌ర్య‌లు.. ప‌డిన క‌ష్టం వంటివి ప్ర‌త్యేకంగా చ‌ర్చ‌నీయాంశం కానున్నాయి. మెజారిటీ హిందువులు ఉన్న భార‌త దేశంలో వారి సెంటిమెంటును రెచ్చ‌గొట్ట‌డం ద్వారా.. ఎన్నిక‌ల్లో ల‌బ్ది పొందాల‌నేది ప్ర‌స్తుతం కేంద్రంలోని బీజేపీ వ్యూహం. అందుకే.. అయోధ్య రామ‌మందిర నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిప‌దిక‌న నిర్మించ‌డం.. అహ‌ర‌హం.. ప్ర‌ధాని మోడీ దీనిని ప‌ర్య‌వేక్షించ‌డం వంటివి జ‌రిగాయి.

అయితే.. ఇలా అయోధ్య‌ను రాజ‌కీయాల్లో వాడుకోవ‌డం.. ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొంద‌డం అనేది ఇప్పుడు కొత్త‌కాదు. 1990లలోనే అయోధ్య రాజ‌కీయ వ‌స్తువుగా మారిపోయింది. అప్ప‌ట్లో బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి లాల్ కిష‌న్ అద్వానీ.. దీనిని ఒక ఉద్య‌మంగా ముందుకు తీసుకువెళ్లారు. ప్ర‌తి హిందువు ఇంటిపై జెండా ఎగ‌రాల‌ని పిలుపునిచ్చారు. అంతేకాదు.. అయోధ్య ర‌థ‌యాత్ర‌కు శ్రీకారం చుట్టారు. అరెస్టులు.. లాఠీ చార్జీల‌కు సైతం వెనుకాడేది లేద‌ని తేల్చి చెప్పారు.

అనుకున్న‌ట్టుగానే ర‌థ యాత్ర చేశారు. ఇది కాస్తా.. ఎన్నిక‌ల యాత్ర‌గా మారి.. 1990ల‌లోనే బీజేపీ అధికా రంలోకి వ‌చ్చేందుకు అవ‌కాశం క‌ల్పించింది. 547 మంది స‌భ్యులు ఉన్న భార‌త పార్ల‌మెంటులో అప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం బిక్కుబిక్కు మంటూ ఇద్ద‌రు స‌భ్యుల‌తో ఉన్న బీజేపీ.. అనూహ్యంగా 303 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుని తిరుగులేని అధికారాన్ని చేప‌ట్టింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ప్ర‌ధాన సాక్షి.. రామ మందిర మే! ఈ విష‌యాన్ని అద్వానీ ప‌లు సంద‌ర్భాల్లోనూ వెల్ల‌డించారు.

ఇక, ఇప్పుడు ప‌రిస్థితి దానికి ఏమాత్రం తీసిపోవ‌డం లేదు. పైగా మ‌రింత ల‌క్ష్యం ఏర్పాటు చేసుకుని బీజేపీ నాయ‌కులు దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు.. ఇప్పుడు దేశాన్ని,రాష్ట్రాల‌ను రామ‌నామ జ‌పంలో ముంచేయ‌డంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ పూర్తిగా స‌క్సెస్ అయ్యార‌న‌డంలో సందేశం లేదు. ఇక‌, వ‌చ్చే రెండు మాసాల్లో.. జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో ఈ అయోధ్య రామమందిరం త‌మ‌కు 400 సీట్ల‌కు పైగానే తీసుకువ‌స్తుంద‌ని మోడీ అంచ‌నా వేసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

ఇప్పటికే 2014 నుంచి వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న మోడీకి ఇప్పుడు అయోధ్య రామమందిరం రూపంలో మూడో సారి కూడా విజ‌యం ద‌క్క‌డం ఖాయ‌మ‌నే అంచ‌నాలు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి రామ మందిరం సాక్షిగా.. నాడు 300 ల సీట్లు వ‌స్తే.. నేడు 400ల‌కుపైగా టార్గెట్ పెట్టుకోవ‌డం మ‌రింత విశేషం!!

This post was last modified on January 22, 2024 10:45 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తేజ సజ్జ మెచ్యూరిటీని మెచ్చుకోవచ్చు

అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…

2 hours ago

జనసేన, శివసేనల లక్ష్యం అదే: పవన్

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…

2 hours ago

ఆరెంజ్ హీరోయిన్ పెళ్లి కుదిరింది

అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…

3 hours ago

పుష్ప 2 హంగామా వేరే లెవెల్

టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…

3 hours ago

కాంట్రాక్లర్ల జీవితాలు జగన్ నాశనం చేశాడు

విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…

3 hours ago

ఓట్ల కోసం రాలేదు.. మరాఠా గడ్డపై పవన్

మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…

3 hours ago